టి.నరసాపురం: మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై డి.దుర్గామహేశ్వరరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని జగ్గవరం గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన చిలకా లక్ష్మణరావు అతని ఇంటికి తీసుకువెళ్లాడన్నారు. చీమలు తొలగిస్తానని చెప్పి బాలిక దుస్తులు తొలగించి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అయితే బాలిక శరీరంపై గాయాలు గుర్తించిన బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లక్ష్మణరావుపై పోక్సో కేసు నమోదు చేశారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
ఆగిరిపల్లి: గత నెల 26న గన్నవరం మండలం వీరపనేని గూడెం వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో చిన్నాగిరిపల్లి గొల్లగూడేనికి చెందిన బడుగు శివమ్మ (33)పిన్నమనేని హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.