
శ్రీవారి కొండపై ఫుట్‌పాత్‌ను ఢీకొట్టి నిలిచిన కారు
శ్రీవారి కొండపై ఒక కారు బుధవారం సాయంత్రం హల్‌చల్ చేసింది. మద్యం మత్తులో ఉన్న ఆ కారు డ్రైవర్ తొలుత ఓ కారును
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపై ఒక కారు బుధవారం సాయంత్రం హల్‌చల్ చేసింది. మద్యం మత్తులో ఉన్న ఆ కారు డ్రైవర్ తొలుత ఓ కారును, నిమ్మకాయలు అమ్మే మహిళను, ఆ తరువాత ఫుట్‌పాత్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మహిళ కాలికి తీవ్ర గాయమైంది.
స్థానికుల కథనం ప్రకారం... శ్రీవారి కొండపై నుంచి వేగంగా కిందకు వస్తున్న ఇండికా కారు ఆలయ జంట గోపురాల ప్రాంతంలోని ఒక భక్తుడి కారును ఢీకొట్టి ఆగకుండా అదే ప్రాంతంలో నిమ్మకాయలు అమ్ముకుంటున్న కొమ్మర గ్రామానికి చెందిన మానుకొండ శేషమ్మ అనే మహిళను ఢీకొట్టింది.
అనంతరం పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌ను ఢీకొట్టి నిలిచిపోయింది. అయితే ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు తెలుసుకున్న దేవస్థానం సెక్యురిటీ సిబ్బంది అతడిని స్థానిక పోలీస్టేషన్‌లో అప్పగించారు. గాయపడిన మహిళ శేషమ్మకు దేవస్థానం ప్రథమ చికిత్సా కేంద్రంలో సిబ్బంది చికిత్స అందించారు.