నవోదయ పరీక్ష ప్రశాంతం | - | Sakshi
Sakshi News home page

నవోదయ పరీక్ష ప్రశాంతం

Nov 30 2026 12:17 AM | Updated on Nov 30 2026 12:17 AM

మామునూరు: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జవహర్‌ నవోదయ విద్యాలయం 2027–28 విద్యాసంవత్సరానికి ఆరోతరగతి అడ్మిషన్ల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. నగరంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 27 పరీక్ష కేంద్రాల్లో 5,313 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 4,579 మంది హాజరయ్యారు. 734 మంది గైర్హాజరయ్యారు. 86.18 శాతం విద్యార్థులు హాజరైనట్లు పర్యవేక్షకులు నవోదయ ఇన్‌చార్జ్‌ ప్రిన్స్‌పాల్‌ టి.రమేశ్‌ తెలిపారు. ఈపరీక్ష ప్రశాంతంగా జరగడానికి సహకరించిన పోలీస్‌, ఉన్నతాధికారులు, పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులకు మామునూరు నవోదయ విద్యాలయ ఇన్‌చార్జ్‌ ప్రిన్స్‌పాల్‌ టి.రమేశ్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

గ్లోబల్‌ సమ్మిట్‌కు

సర్పంచ్‌ అచ్యుతం

ఖానాపురం: హైదరాబాద్‌లోని ఫ్యూచర్‌ సిటీలో డిసెంబర్‌లో నిర్వహించనున్న గ్లోబల్‌ సమ్మిట్‌కు మండలంలోని అశోక్‌నగర్‌ గ్రామ సర్పంచ్‌ జాడి అచ్యుతం ఎంపికయ్యారు. తెలంగాణవ్యాప్తంగా తొమ్మిది మంది సర్పంచ్‌లు గ్లోబల్‌ సమ్మిట్‌కు ఎంపికవ్వగా.. అందులో అచ్చుతం ఒకరు. కాగా, శుక్రవారం హైదరాబా ద్‌ ఐటీసీ కాకతీయ హోటల్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని పునరుత్పాదక ఇంధనం, వృత్తికార ఆర్థిక వ్యవస్థ, గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తపర్చారు. శిక్షణలో కార్యచరణ ప్రణాళిక రూపకల్పనలో అభిప్రాయాలను తెలపడంతో సీఎం రేవంత్‌రెడ్డి అచ్యుతంను అభినందించారు. గ్లోబల్‌ సమ్మిట్‌కు ఆయన ఎంపికవడంతో పలువురు అభినందనలు తెలిపారు.

ఎన్‌సీడీ నిర్దేశిత లక్ష్యాలు సాధించాలి..

సంగెం: ప్రజల్లో అసంక్రమిత వ్యాధులపై అవగాహన కల్పించి, వ్యాధి నిర్ధారణ పరీక్షలను విస్తృతంగా నిర్వహించి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని ఎన్‌సీడీ పీఓ డాక్టర్‌ ఇక్తాదర్‌ అహ్మద్‌ సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఎన్‌సీడీ కార్యక్రమాల అమలుపై రికార్డులు తనిఖీ చేసి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్‌సీడీ ప్రో గ్రాంలో లక్ష్యాలు చేరుకోకపోతే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్‌ వంశీకృష్ణ, ఎన్‌సీడీ సూపర్‌వైజర్‌ ప్రకాశ్‌రెడ్డి, స్టాఫ్‌నర్స్‌ సంధ్య, పల్లె దవాఖాన వైద్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement