హాస్టల్‌ భవనాల ప్రారంభానికి సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

హాస్టల్‌ భవనాల ప్రారంభానికి సర్వం సిద్ధం

Nov 30 2026 12:17 AM | Updated on Nov 30 2026 12:17 AM

● రేపు మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ప్రారంభం

● పనులు పరిశీలించిన అధికారులు, నేతలు

మామునూరు: వరంగల్‌ మామునూరులోని వెట ర్నరీ సైన్స్‌ కళాశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన బాలుర, బాలికల హాస్టల్‌ భవనాల ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈనెల 30న రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి.దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా హాస్టల్‌ భవనాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈనేపథ్యంలో శనివారం ప్రారంభోత్సవ ఏర్పాట్లను కాంగ్రెస్‌ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌.నాగరాజు, వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద పరిశీలించారు. నూతన హాస్టల్‌ భవనాల్లో వసతులు, మంత్రి పర్యటన, ప్రారంభోత్సవ ఏర్పాట్లు, ప్రొటోకాల్‌, ఇతర సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలిచ్చారు. ఏర్పాట్ల పరిశీలనలో తహసీల్దార్‌ ఇక్బాల్‌, వెటర్నరీ కళాశాల అధికారులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement