● డీఎంహెచ్ఓ రాజారెడ్డి
ఖానాపురం: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని డీఎంహెచ్ఓ రాజారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీ, సబ్సెంటర్లను ఆయన శనివారం తనిఖీ చేశారు. రిజిస్టర్లు, వాక్సి న్ నిల్వలు పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో పురోగతి సాధించాలన్నా రు. అనంతరం బీసీ హాస్టల్ భవనం సందర్శించి పీహెచ్సీ తరలింపునకు కావాల్సిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రకాశ్, పీహెచ్సీ వైద్యాధికారి జ్యో తి, పల్లె వైద్యాధికారి సునీత, సీహెచ్ఓ జమీరుద్దీ న్, ఫార్మసీ ఆఫీసర్ శ్రీనివాసాచారి, హెల్త్ అసిస్టెంట్స్ గొడిశాల భాస్కర్, రాంప్రసాద్‌రెడ్డి, సునీత, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ తనిఖీ
నర్సంపేట రూరల్: నర్సంపేటలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ (టీ హబ్)ను శనివారం డీఎంహెచ్ఓ రాజారెడ్డి, డీఐఓ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రకాశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందించే వైద్య సేవలు పరిశీలించారు. కార్యక్రమంలో టీహబ్ పాథాలజిస్ట్ డాక్టర్ లత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


