ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలి | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలి

Oct 16 2026 1:06 AM | Updated on Oct 16 2026 1:06 AM

సాక్షి, వరంగల్‌: రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని కొందరు.. వీరి పాత్ర ఏముంటుందని మరికొందరు అంటున్నారని.. అందుకే త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రతి ఉద్యోగి ముందు ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల (టీజీఈ) జేఏసీ చైర్మన్‌ వి.లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో జేఏసీ నేత ఇక్బాల్‌ అధ్యక్షతన వరంగల్‌లో గురువారం ఉద్యోగులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలను చేరవేయడంలో ఉద్యోగుల పాత్రనే కీలకమని అన్నారు. ఉద్యోగుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను సైతం ఓటరుగా నమోదు చేయించాలని కోరారు. ‘రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ముఖాముఖి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి సమస్యను ప్రభుత్వం దగ్గరకు తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తాం’ అని పేర్కొన్నారు. ఉద్యోగుల ఐక్యతే టీజీఈ జేఏసీ బలమని, ఒకవైపు ఉద్యోగుల హక్కుల కోసం ప్రభుత్వంతో కొట్లాడుతూనే.. మరోవైపు అదే ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ విజయాలు సాధిస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికే ఉద్యోగులకు రెండు డీఏలు సాధించామని, ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకం రావడంలో, రూపాయి చెల్లించకుండా వైద్య సేవలు పొందడంలో టీజీఈజేఏసీ కృషి ఉందని వివరించారు. టీజీఈజేఏసీ జనరల్‌ సెక్రటరీ వొడ్నాల రాజశేఖర్‌, టీజీటీఏ స్టేట్‌ అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌, నాయకులు ఎస్‌.రాములు, కె.మహిపాల్‌రెడ్డి, బాణాల రాంరెడ్డి, రమేశ్‌ పాక, పూల్‌సింగ్‌చౌహాన్‌న్‌ తదితరులు పాల్గొన్నారు

ఉద్యోగులు ఓటరుగా పేరు

నమోదు చేసుకోవాలి

సమస్యలు తెలుసుకునేందుకే ముఖాముఖి కార్యక్రమం

టీజీఈజేఏసీ చైర్మన్‌ వి.లచ్చిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement