పథకాలకు దూరంగా తోటి తెగ | - | Sakshi
Sakshi News home page

పథకాలకు దూరంగా తోటి తెగ

Oct 16 2026 1:06 AM | Updated on Oct 16 2026 1:06 AM

గీసుకొండ: పర్టికులర్లీ వల్నరబుల్‌ ట్రైబల్‌ గ్రూప్‌ (పీవీటీజీ) తెగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. జాన్‌పాకలోని కొమురంభీమ్‌ ఆదివాసీ భవన్‌లో జాతీయ ఉపాధ్యక్షుడు సోయం రాజేందర్‌, తెలంగాణ ఆదివాసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రం రఘు అధ్యక్షతన ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నివసిస్తున్న మైదాన ప్రాంత ఆదిమ తెగ తోటి (పీవీటీజీ) జాతి స్థితిగతులపై గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మైపతి అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఆదివాసీ సమాజంలోని 9 తెగల హక్కుల కోసం తుడుందెబ్బ అనాదిగా పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. కేంద్ర స్థాయిలో పీవీటీజీగా గుర్తింపు పొందిన తోటి తెగ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు దూరంగా ఉందని పేర్కొన్నారు. ఈ తెగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లతో ప్రత్యేక పీవీటీజీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈసం సుధాకర్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి సిద్ధబోయిన లక్ష్మీనారాయణ, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గుర్రాల రవీందర్‌, పీవీటీజీ తెగ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సోయం శరత్‌బాబు, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సోయం నాగరాజు, మహిళలు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు

మైపతి అరుణ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement