సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనుల పరిశీలన

Jun 20 2026 12:36 PM | Updated on Jun 20 2026 12:36 PM

‘హరిత కాకతీయ’లో సాంస్కృతిక వైభవం

కాశిబుగ్గ: వరంగల్‌లో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మౌలిక వసతులు, విద్యుత్‌, తాగునీరు, పారిశుద్ధ్య పనుల పురోగతిని అధికారులను ఆమె అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేసి ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అలాగే, నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఎలాంటి లోపాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రి పనులు సకాలంలో పూర్తయితే జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.

వర్ధన్నపేట మున్సిపల్‌ కమిషనర్‌గా అశోక్‌

వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా జి.అశోక్‌ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌ జోనా.. డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ అశోక్‌ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడం, పారిశుద్ధ్య నిర్వహణను మరింత బలోపేతం చేయడం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం మున్సిపల్‌ చైర్మన్‌ పాలకుర్తి సారంగపాణిని అశోక్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.

పోర్టల్‌లో నమోదు తప్పనిసరి

రామన్నపేట: హనుమకొండ జిల్లాలోని క్లినిక్‌లు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లు, హాస్పిటల్స్‌ తప్పనిసరిగా తెలంగాణ క్యాన్సర్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని డీఎంహెచ్‌ఓ ఎస్‌డీ రాంకుమార్‌ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం హనుమకొండలోని రెనోవా బన్ను క్యాన్సర్‌ హాస్పిటల్‌, అజర హాస్పిటల్‌, విజయ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌, రాడార్‌ డయాగ్నొస్టిక్‌ సెంటర్లను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ రాంకుమార్‌ మాట్లాడుతూ ల్యాబ్‌లు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లు నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, వ్యాధి నిర్ధారణ, రిపోర్టింగ్‌లో ఏమాత్రం నిర్లక్ష్యం చూపరాదన్నారు. అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ టి.మదన్‌మోహన్‌వు, ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ శ్రీనివాస్‌, జిల్లా మాస్‌ మీడియా అధికారి వి.అశోక్‌రెడ్డి, డీపీఓ రుక్ముద్దీన్‌, ఆస్పత్రుల డాక్టర్లు పాల్గొన్నారు.

హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక, సాంస్కృతిక శాఖ, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రతీ శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో సాంస్కృతిక వైభవాన్ని నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా పర్యాటక శాఖాధికారి ఎం.శివాజీ, హరిత కాకతీయ హోటల్‌ మేనేజర్‌ అశోక్‌రెడ్డి, కార్యక్రమాల సమన్వయకర్త కుసుమ సూర్యకిరణ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు (శనివారం) సాయంత్రం 6 నుంచి రాత్రి గంటల వరకు కాకతీయుల వైభవాన్ని ప్రతిబింబించే పేరిణి నృత్యం, చిందు యక్షగానం ప్రదర్శించనున్నుట్లు వివరించారు.

నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ రాక

హన్మకొండ అర్బన్‌: ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌న్‌, ఐదుగురు కమిషన్‌ సభ్యులు శనివారం హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు హనుమకొండ కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనుంది. భూవివాదాలు, అట్రాసిటి కేసులు, వివిధ శాఖల్లో రోస్టర్‌ పాయింట్ల అమలుపై కమిషన్‌ ప్రధానంగా దృష్టి సారించనుంది. సమావేశానికి జిల్లా అధికారులు పూర్తిస్థాయి నివేదికలు, పూర్తి సమాచారంతో హాజరుకావా లని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆదేశించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement