ప్రభుత్వ పాఠశాలలకు తగ్గుతున్న ఆదరణ | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలలకు తగ్గుతున్న ఆదరణ

Jun 15 2026 7:28 AM | Updated on Jun 15 2026 7:28 AM

జిల్లా విద్యాముఖ చిత్రం ఇలా.

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తున్నా.. ఆ బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఏటికేడు పడిపోతోంది. జిల్లాలో మొత్తం విద్యార్థుల సంఖ్యలో హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ ప్రైవేట్‌ పాఠశాలలు మాత్రం ప్రతీ ఏడాది కొత్త విద్యార్థులను ఆకర్షిస్తూ తమ బడుల్లో చేరేలా సరికొత్త ప్రణాళికలతో ముందుకెళుతున్నాయి. గత మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే మొత్తం విద్యార్థుల్లో ప్రభుత్వ పాఠశాలల వాటా 2023–24లో 35.5 శాతం ఉండగా, 2025–26 నాటికి అది 34.8 శాతానికి పడిపోయింది. మరోవైపు ప్రైవేట్‌ పాఠశాలల వాటా 59 శాతం నుంచి 65 శాతానికి చేరువకావడం జిల్లాలో విద్యార్థుల ఎంపికలు ఎలా మారుతున్నాయో చెబుతోంది. అయితే ఈ ప్రైవేట్‌ పోటీకి ఽధీటుగా ప్రభుత్వం ‘మన ఊరు–మన బడి’, ఇంగ్లిష్‌ మీడియం, డిజిటల్‌ విద్య, మౌలిక వసతుల కల్పన వంటి చర్యలు చేపడుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో విద్యార్థుల నమోదు పెరగకపోవడం విద్యాశాఖకు సవాల్‌గా మారింది. జిల్లాలో ఇప్పటికీ 132 జీరో స్కూల్స్‌ ఉండటం గమనార్హం.

ప్రైవేట్‌దే హవా...

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 538 ఉండగా, ప్రైవేట్‌ పాఠశాలలు కేవలం 253 మాత్రమే ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యలో ప్రైవేట్‌ విద్యాసంస్థలు దాదాపు రెట్టింపు ఆధిక్యాన్ని కొనసాగించడం గమనార్హం.

కారణాలివేనా..?

ఇంగ్లిష్‌ మీడియం బోధన, సీబీఎస్‌ఈ పాఠ్యాంశాలపై పెరుగుతున్న ఆసక్తి, డిజిటల్‌ తరగతులు, ప్రత్యేక కోచింగ్‌, పోటీ పరీక్షల సన్నద్ధత, రవాణా సౌకర్యాలు వంటి కారణాలతో తల్లిదండ్రులు ప్రైవేట్‌ పాఠశాలలను ఎంచుకుంటున్నారని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో జనాభా తగ్గుదల, పట్టణాలకు వలసలు, కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తక్కువ నమోదు వంటి అంశాలు ప్రభుత్వ బడులపై ప్రభావం చూపుతున్నాయని అభిప్రాయపడుతున్నారు.

43,700

45,884

43,200

1,20,932

1,24,000

1,29,190

80,800

76,306

77,200

2025–26

2023–24

2024–25

మొత్తం విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేట్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement