పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

Jun 15 2026 7:28 AM | Updated on Jun 15 2026 7:28 AM

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి ఎంజీఎంలో డిప్యుటేషన్‌పై నర్సింగ్‌ సిబ్బంది

వరంగల్‌ చౌరస్తా: పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం (ఎస్‌జీపీఏటీ) రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి వెలిశోజు రామమనోహర్‌ డిమాండ్‌ చేశారు. వరంగల్‌ గిర్మాజీపేటలోని సరస్వతి విద్యానికేతన్‌ పాఠశాలలో ఎస్‌జీపీఏటీ కాశిబుగ్గ యూనిట్‌ సమావేశం ఎండీ మదార్‌ సాహెబ్‌ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. హెల్త్‌ కార్డులకు సంబంధించి విధివిధానాలు లేకుండా, వైద్యశాలల ఎంపిక జరుగకుండా, పెన్షనర్లకు సమాచారం లేకుండా ప్రీమియం మినహాయించడం శోఛనీయమన్నారు. నాయకులు సుధీర్‌బాబు, తుమ్మ వీరయ్య, గునిగంటి సాంబయ్య, నిమ్మకాయల సదానందం, మధుసూదన్‌ రావు, వీరస్వామి, కుమారస్వామి, భిక్షపతి, ఎన్‌.సత్యనారాయణ, పెద్దూరి పెద్దన్న, చంద్రమౌళి పాల్గొన్నారు.

కాశిబుగ్గ: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో 478 మంది నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులకు 161 మంది ఇన్‌పేషెంట్లకు సేవలందించడం సమస్యగా మారింది. రెండు వార్డులకు కలిపి ఒక నర్సింగ్‌ ఆఫీసర్‌తో సేవలందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈక్రమంలో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలోని నర్సింగ్‌ ఆఫీసర్లను డిప్యుటేషన్‌పై ఎంజీఎం ఆస్పత్రికి పంపించారు. అలాగే, నర్సింగ్‌ స్కూల్‌కు చెందిన వందలాది మంది విద్యార్థినులను కూడా నర్సింగ్‌ ఆఫీసర్లకు అసిస్టెంట్లుగా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. నర్సింగ్‌ ఆఫీసర్ల సమస్య తీరాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కొత్తవారు జాయిన్‌ అయితేనే నర్సింగ్‌ సేవలు సజావుగా అందుతాయి. ఎంజీఎంలో సూపరింటెండెంట్‌ పోస్టు భర్తీ కాకపోవడం, నర్సింగ్‌ సిబ్బంది లేక పోవడం అధికారులకు తలనొప్పిగా మారింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement