గ్రామాభివృద్ధికి ప్రణాళికే తొలిమెట్టు | - | Sakshi
Sakshi News home page

గ్రామాభివృద్ధికి ప్రణాళికే తొలిమెట్టు

Jun 12 2026 7:25 AM | Updated on Jun 12 2026 7:25 AM

జిల్లా పంచాయతీ అధికారి కల్పన

రాయపర్తి: గ్రామాల అభివృద్ధికి మంచి ప్రణాళికే తొలిమెట్టు అని జిల్లా పంచాయతీ అధికారి కటకం కల్పన పేర్కొన్నారు. గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికల (జీపీడీపీ) తయారీపై మండల కేంద్రంలోని రైతువేదికలో గురువారం అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. డీపీఓ కల్పన, ప్రోగ్రాం మేనేజర్‌ జానకీరాం ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వివిధ శాఖల నిధులు, పథకాలను అనుసంధానం చేసుకోవడం ద్వారా గ్రామాల అభివృద్ధి వేగవంతం అవుతుందని వివరించారు. ఎంపీడీఓ కూచన ప్రకాశ్‌ అధ్యక్షతన జరిగిన సమన్వయ సమావేశంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు, లైన్‌ డిపార్ట్‌మెంట్ల మండలస్థాయి అధికారులు, మైలారం, కొత్తూరు సర్పంచ్‌లు చిర్ర వేణు, కందికట్ల స్వప్న, వివిధ శాఖల అధికారులు ఆశిష్‌, అనిల్‌కుమార్‌, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement