మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు
● వార్డుల వారీగా ప్రకటించిన అధికారులు
● చైర్మన్ స్థానం జనరల్‌కు కేటాయింపు..
పరకాల : పరకాల మున్సిపాలిటీకి రిజర్వేషన్ ఖరారైంది. దీంతో ఆశావహులు ఎన్నికల పోరుకు సన్నద్ధం అవుతున్నారు. 15 ఏళ్ల క్రితం ఎస్సీ రిజర్వుడు కాగా.. ఈసారి చైర్మన్ స్థానం జనరల్‌కు కేటాయించారు. దీంతో అన్ని రాజకీయ పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వార్డుల వారీగా రిజర్వేషన్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. పరకాలలో మొత్తం 22 వార్డులకు గాను మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చట్ట ప్రకారం మహిళలకు అధిక ప్రాధాన్యం (11 స్థానాలు) లభించగా, జనరల్ మహిళ, బీసీ మహిళ, ఎస్సీ మహిళ కేటగిరీల్లో వార్డులు కేటాయించారు. రిజర్వేషన్ జాబితా వెల్లడి కావడంతో ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎన్నికల వ్యూహాలపై దృష్టి సారించారు. రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల్లో చర్చలు మొదలయ్యాయి. ఈ రిజర్వేషన్లు పరకాల మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణలను ప్రభావితం చేసే ఆవకాశం ఉందని స్థానికంగా చర్చ సాగుతోంది.
వార్డుల వారీగా రిజర్వేషన్లు..
జనరల్ వార్డులు : 1, 7, 8, 9, జనరల్ మహిళ : 2, 6, 10, 12, 13, 14, 18, బీసీ మహిళ : 3, 5, ఎస్సీ మహిళ : 4, 17, బీసీ జనరల్ : 15, 16, 22, ఎస్సీ జనరల్ : 11, 19, 21, ఎస్టీ జనరల్ : 20


