ధాన్యం బోనస్ కోసం నిరీక్షణ
● రైతులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.54 కోట్లు
● జిల్లాలో 15,311 మెట్రిక్ టన్నుల
సన్న ధాన్యం సేకరణ
నర్సంపేట: ధాన్యాగార కేంద్రంగా పేరొందిన జిల్లాలో సన్న ధాన్యం విక్రయించిన అన్నదాతకు బోనస్ డబ్బుల కోసం నిరీక్షణ తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో రైతులు సన్నరకం ధాన్యం సాగు చేశారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు 15,311 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని సేకరించారు. బోనస్ కింద రూ.75.2 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.21.2 కోట్లను మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి బోనస్ డబ్బులు చెల్లించాలని రైతులు కోరుతున్నారు. కాగా, జిల్లాలో ప్రధాన నీటి వనరు అయిన పాకాల సరస్సులో నీరు సమృద్ధిగా ఉంది. యాసంగి పంటకు తైబందీ ఖరారు అయింది. సరస్సు కింద 50 వేల ఎకరాల్లో వరి పంట సాగుచేస్తారు.
బోనస్ డబ్బులు జమ కాలేదు
నల్లబెల్లి మండలం గోవిందా పురం ఐకేపీ సెంటర్ పరిధిలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన సన్నవడ్ల బోనస్ డబ్బులు ఇప్ప టి వరకు జమ కాలేదు. నా పేరుతో పాటు కుటుంబ సభ్యుల పేర్లపై మొత్తం 266 బస్తాల (106.40 క్వింటాళ్లు) సన్నవడ్లు విక్రయించాను. ఇందుకు రావాల్సిన రూ.53,200 బోనస్ డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయి. గత యాసంగి సీజన్ బోనస్ కూడా అందలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి డబ్బులు విడుదల చేయాలి.
– గుగులోత్ మునేందర్, ఎర్రయిచెరువుతండా


