రెండోరోజూ దీపారాధన | - | Sakshi
Sakshi News home page

రెండోరోజూ దీపారాధన

Jan 7 2026 7:14 AM | Updated on Jan 7 2026 7:14 AM

రెండో

రెండోరోజూ దీపారాధన

అన్నారంలో అన్నదానం చేస్తున్న ఎస్సై ప్రవీణ్‌

ప్రత్యేక పూజలో పాల్గొన్న వక్ఫ్‌బోర్డు అసిస్టెంట్‌ సెక్రటరీ అమీద్‌ అహ్మద్‌, ముజావార్లు

కొనసాగుతున్న అన్నారం దర్గా ఉత్సవాలు

పర్వతగిరి: మండలంలోని అన్నారం షరీఫ్‌ గ్రామంలోని యాకుబ్‌బాబా దర్గాలో రెండో రోజు ఉత్సవా ల్లో భాగంగా మంగళవారం దీపారాధన కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. తెల్లవారు జామున జరిగిన గంధం సమర్పణ అనంతరం వక్ఫ్‌బోర్డు అసిస్టెంట్‌ సెక్రటరీ అమీద్‌ అహ్మద్‌ ప్రత్యేక పూజలు నిర్వహించి చాదర్‌ సమర్పించారు. ముజావార్లు దీపారాధన నిర్వహించిన అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాకుబ్‌బాబా దర్గాతో పాటు గుంషావళి, బోలేషావళి, మహబూబియా, చిల్లాలను దర్శించుకున్నారు. వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదానాన్ని వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌ రియాజ్‌, ఎస్సై బోగం ప్రవీణ్‌లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అన్నారం సర్పంచ్‌ గాడిపెల్లి మహేందర్‌, మోటపోతుల సారంగపాణి, భిక్షపతి, రాపోలు ర వి, బీజేపీ మండల నాయకుడు జలేందర్‌, వక్ఫ్‌బో ర్డు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

రెండోరోజూ దీపారాధన1
1/1

రెండోరోజూ దీపారాధన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement