పేదరికం క్రీడలకు అడ్డుకాదు
● డీఐఈఓ శ్రీధర్‌సుమన్
వరంగల్: పేదరికం క్రీడలకు అడ్డుకాదని, క్రీడల్లో ప్రతిభ ఉంటే ప్రభుత్వం అందిస్తున్న రిజర్వేషన్లను వినియోగించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి డా క్టర్ శ్రీధర్‌సుమన్ అన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆదేశాల మేరకు వరంగల్ ఓసిటీలోని మినీస్టేడియంలో జిల్లా అండర్ 19 బాలబాలికల జూడో క్రీడాపోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌సుమన్ మాట్లాడు తూ క్రీడలు శారీరక దృఢత్వంతోపాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అండర్ 19 అసోసియేషన్ కార్యదర్శి నల్ల శ్రీధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోశాధికారి, రాష్ట్ర జూడో సంఘం అధ్యక్షుడు కై లాష్‌యాదవ్, జిల్లా క్రీడా మండలి అధికారి అనిల్ కుమార్, మాజీ అండర్ 19 కార్యదర్శులు డాక్టర్ కోట సతీష్, డాక్టర్ గోపి, టోర్నమెంట్ అబ్జర్వర్లు రామయ్య, అనిత, జూడో సంఘం బాధ్యులు దుపాకి సంతోష్ కుమార్, ఎన్. నాగరాజు, సిహెచ్.రాము, బి.సాయిరాం యాదవ్, కె. కిరణ్ కుమార్, క్రీడాకారులు పాల్గొన్నారు.


