ఆయిల్‌పామ్ గెలలు ఇప్పుడే కోయొద్దు
● పంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
● ఉద్యానవన అధికారి తిరుపతి
గీసుకొండ: ఆయిల్‌పామ్ గెలలు ఇప్పుడే కోయొద్దని, పూర్తిగా నారింజ రంగులోకి మారిన తర్వాతే కోయాలని ఉద్యానవన అధికారి ఎన్.తిరుపతి సూచించారు. సోమవారం తోటలు సాగు చేసిన రైతులు పంట దిగుబడికి సస్యరక్షణ చర్యలు, ఎరువుల వాడకం, నీటి యాజమాన్య పద్ధతులపై మండలంలోని అనంతారంలోని రైతు రాంబాబు పంట క్షేత్రాన్ని సందర్శించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉద్యానవన శాఖ అధికారి మాట్లాడుతూ రైతులు క్రమం తప్పకుండా ఎరువుల వేయాలని, ఒక ఎకరానికి నెలకు 5 కిలోల యూరియా, 3 కిలోల డీఏపీ, 5 కిలోల పొటాష్, 1.25 కిలోల మెగ్నీషియం, 250 గ్రాములు బోరాక్స్ డ్రిప్‌లో ఫెర్టిగేషన్ ద్వారా అందించాలన్నారు. గెలలు కోత సమయంలో పూర్తిగా నారింజ రంగులోకి మారిన తర్వాత మాత్రమే కోయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సతీష్, ఉద్యాన విస్తరణ అధికారి వేణు, రాంచరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ ఫీల్డ్ ఆఫీసర్స్ జీవన్, దీపక్, రైతులు పాల్గొన్నారు.


