కాజీపేట జంక్షన్‌లో తనిఖీలు
కాజీపేట రూరల్: ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో.. ముందస్తు జాగ్రత్తగా కాజీపేట సివిల్ పోలీసులు, రైల్వే పోలీసులు సంయుక్తంగా కాజీపేట జంక్షన్‌లో సోమవారం రాత్రి జాగిలాలతో విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్లాట్‌ఫాంలు, ప్రయాణికులు వేచి ఉండు గదులు క్షుణ్ణంగా తనిఖీలు చేసి అనుమానాస్పద వస్తువులు, లగేజీలను తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. రాత్రి పోలీసు బృందాల తనిఖీలతో ప్రయాణికులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. కాజీపేట సివిల్ సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐ నవీన్, పోలీసులు తనిఖీల్లో ఉన్నారు.


