భద్రకాళి ఆలయంలో దీపోత్సవం
హన్మకొండ కల్చ రల్: భద్రకాళి ఆలయంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి దీపోత్సవాన్ని దేవాలయ ఈఓ రామల సునీత ప్రారంభించారు. దీపాలు వెలిగించిన అనంతరం మహిళలకు వాయినాలు ఇచ్చారు. సాంస్కృతికోత్సవంలో కూచిపూడి నృత్యాలు, భజ నలు అలరించాయి. కార్యక్రమంలో సేవాసమితి సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యారణ్యపురి: జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్ష విభాగంలో ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులకు నిర్వహిస్తున్న భవిత కేంద్రంలో ఫిజియోథెరపిస్టులుగా సేవ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్, ఇన్‌చార్జ్ డీఈఓ ఎ.వెంకటరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ జిల్లాలోని పరకాల, శాయంపేట, ఆత్మకూరు, దామెర, వేలేరు, కమలాపూర్, భీమదేవరపల్లి, నడికూడ మండలాల్లోని భవిత కేంద్రాల్లో తాత్కాలిక పద్ధతిపై నియామకం కోసం అర్హులైనవారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. బ్యాచ్‌లర్ ఆఫ్ ఫిజియోథెరపీ, మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సు పూర్తి చేసినవారు అర్హులని పేర్కొన్నారు. ఈనెల 13వ తేదీ వరకు జిల్లా విద్యాశాఖలోని సమగ్ర శిక్షలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం సమగ్ర శిక్ష జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి 96036 72289 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓపెన్ టు ఆల్ చదరంగ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు సోమవారం ట్రోఫీలు అందజేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 180 మంది క్రీడాకారులు హాజరు కాగా.. కె.సమరతేజ (కరీంనగర్) మొదటి స్థానంలో, టి.రాజు (వరంగల్) ద్వితీయ, విన్సెంట్(పెద్దపల్లి) తృతీయ స్థానంలో విజేతలుగా నిలిచినట్లు టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి పి.కన్నా తెలిపారు. ముగింపు కార్యక్రమంలో చీఫ్ ఆర్బిడర్స్ సీహెచ్.శ్రీనివాస్, ప్రేమ్‌సాగర్, రియాజ్, టీటీడీ మండపం మేనేజర్ రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో సోమవారం నిట్, సీఆర్‌ఐఎఫ్ (సెంటర్ ఫర్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ) సౌజన్యంతో పీస్ అండ్ డెవలప్‌మెంట్ పేరిట వరల్డ్ సైన్స్ డేను అట్టహాసంగా నిర్వహించారు. ‘అవేర్‌నెస్ ఆన్ ఆక్సెసెబుల్ అనలిటికల్ టెక్నాలజీ’ అంశంతో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్‌ను నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. థర్మోఫిషర్ సైంటిఫిక్, కీ సైట్ టెక్నాలజీ, నెట్‌వెబ్ టెక్నాలజీ వంటి కంపెనీల ప్రదర్శనలు నూతన ఆవిష్కరణలకు వేదికగా నిలవాలన్నారు. కార్యక్రమంలో నిట్ సీఆర్‌ఐఎఫ్ సిబ్బంది, నిట్ అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ: తిరుపతి, శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ఏసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఏసీ రాజధాని బస్సు నడుపనున్నట్లు ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీసీ వరంగల్–1 డిపోకు చెందిన ఈ బస్సు ప్రతీ రోజు హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి శ్రీశైలంకు ఉదయం 9 గంటలకు బయల్దేరి సాయంత్రం 6 గంటలకు చేరుకుంటుందని, హనుమకొండ నుంచి తిరుపతికి 8.40 గంటలకు బయల్దేరి రాత్రి 11.10 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తీర్థయాత్రలు చేసుకోవాలని ఆయన కోరారు.
భద్రకాళి ఆలయంలో దీపోత్సవం


