సత్వర పరిష్కారానికి చర్యలు
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో వినతులను సత్వరమే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను అదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ నేరుగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రీవెన్స్‌లో స్వీకరించిన వినతులకు అధికారులు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ త్వరగా పరిష్కరించాలన్నారు. ప్రజావాణిలో మొత్తం వివిధ శాఖలకు సంబంధించి 158 వినతులు స్వీకరించినట్లు తెలిపారు. వీటిలో ఎక్కువగా వరద బాధితులను ఆదుకోవాలని, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని, భూ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్‌ఓ వై.వి గణేష్, డీఆర్డీఓ మేన శ్రీను, ఆర్డీఓలు నారాయణ, రమేశ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
వరంగల్ ప్రజావాణిలో 165 వినతులు
న్యూశాయంపేట: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహించొద్దని, వినతులు తక్షణమే పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీడబ్ల్యూఓ రాజమణితో కలిసి ప్రజావాణి వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్‌లో భూ సమస్యలు 45, గృహ నిర్మాణ 15, కలెక్టరేట్ 15, డీడబ్ల్యూఎంసీ 8, పోలీస్‌శాఖ 6, ఇతర శాఖలకు సంబంధించినవి 76 (మొత్తం 165) దరఖాస్తులు రాగా, ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ గణపతి, ఆర్డీఓ ఉమారాణి, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
సత్వర పరిష్కారానికి చర్యలు


