మంగళవారం శ్రీ 11 శ్రీ నవంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఉత్సాహంగా ప్రారంభమైంది.
భూపాలపల్లి జిల్లా రేగొండ, చిట్యాల ప్రాంతాలకు చెందిన కొందరు సిండికేట్‌గా ఏర్పడి హనుమకొండ, జేఎస్ భూపాలపల్లి/ములుగు జిల్లాల్లో 35 దుకాణాలకు 60 వరకు టెండర్ షెడ్యూళ్లు దాఖలు చేయగా 7 దుకాణాలు వచ్చినట్లు తెలిసింది. ఇందులోని ఒకరు సొంతగా 20 దరఖాస్తులు వేస్తే ఐదు దుకాణాలు రాగా, మూడింట్లో సిండికేట్‌కు 70 శాతం వాటా ఇచ్చి.. రెండు సొంతగా నడుపుకునేలా ఒప్పందం జరిగింది. సిండికేట్‌గా మరిన్ని నడిపేందుకు ఇతరులకు వచ్చిన దుకాణాలను గుడ్‌విల్ ఇచ్చి కొనే పనిలో ఉన్నట్లు ప్రచారం.
హనుమకొండకు చెందిన ఇద్దరు వ్యాపారులు రెండు గ్రూపులుగా ఏర్పడి 200 వరకు దరఖాస్తుల వైన్ (ఏ–4)షాపుల కోసం టెండర్లు వేశారు. హనుమకొండ సిటీతో పాటు అత్యధికంగా విక్రయాలు జరిగే దామెర, ఎల్క తుర్తి, హసన్‌పర్తి, ఆత్మకూరు సహా 10 చోట్ల చేజారాయి. దీంతో లక్కీ డ్రా ద్వారా దుకాణాలు పొందిన వారికి రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు ఆఫర్ చేస్తున్నట్లు తెలిసింది.
గ్రేటర్ వరంగల్‌లో ఏళ్ల తరబడిగా మద్యం దందాలో ఆరితేరిన కొందరు.. ఆరేడేళ్లుగా ఈ వ్యాపారంలోకి దిగి క్లిక్కయిన మరికొందరు కలిసి జనగామ, వరంగల్, హనుమకొండ శివార్లలోని దుకాణాలను ‘గుడ్ విల్’ ఇచ్చి చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీటికి సైతం రూ.30 లక్షల నుంచి రూ.1.30 కోట్లు ఇచ్చేందుకు బేరమాడుతున్నట్లు దుకాణాలు పొందిన వారు చెబుతున్నారు.
లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాలు
పొందిన వారికి ‘సిండికేట్ల’ బంఫర్ ఆఫర్
– సాక్షిప్రతినిధి, వరంగల్
..సిండికేట్‌గా ఏర్పడిన కొందరు వ్యాపారులు ఇలా దుకాణాల కోసం పడరాని పాట్లు పడుతుండడంతో రూ.3లక్షలు వెచ్చించి లక్కీ డ్రాలో వైన్‌షాపు పొందిన వారికి కాసుల వర్షం కురుస్తోంది. పోతే పోయినయి రూ.3 లక్షలు.. అంటూ మద్యం దందాలో దిగిన చాలా మందిని ఈసారి ‘లక్కీ’ వరించింది. మద్యం వ్యాపారంతో సంబంధం లేకుండా కొత్తగా దరఖాస్తు చేస్తే అదృష్టం కలిసొచ్చిన వారినుంచి దుకాణాల్ని సొంతం చేసుకునేందుకు మద్యం దందాలో ఆరితేరిన కొందరు సిండికేట్‌గా మారి రూ.లక్షలు ఎర వేస్తున్నారు. కొందరు ‘గుడ్ విల్’కు మొగ్గు చూపుతుండగా.. జిల్లా, నగర కేంద్రాల్లో తామే నడుపుకుంటామన్న పట్టుదలతో ఉన్న వారిని సైతం నయాన్నో భయాన్నో ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెలాఖరుతో 2023–25 సంవత్సరం టెండర్ కాలపరిమితి ముగియనుండగా.. డిసెంబర్ 1 నుంచి 2025–27 దుకాణాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మరో 19 రోజులే గడువు ఉండడంతో చేజారిన దుకాణాలను తిరిగి దక్కించుకునేందుకు సిండికేట్‌గా ఏర్పడిన మద్యం వ్యాపారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
పోటీపడి, భంగపడి..
ఎలాగైనా 2025–27 మద్యం టెండర్లలో దుకాణాలు పొందాలని పోటీపడిన అనేక మంది భంగపడ్డారు. వరంగల్ అర్బన్ (హనుమకొండ) జిల్లాకు సంబంధించి 67 షాపుల కోసం వ్యాపారులు 3,175 దరఖాస్తులు వేశారు. ఈ జిల్లాలో ‘సిండికేట్’ల దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయి. లక్కీ డ్రా లో 67 మందినే దుకాణాలు వరించగా.. 87 శాతం దుకాణాలు కొత్తవారికే వచ్చాయి. వరంగల్ రూరల్ (వరంగల్) జిల్లాలో 57 వైన్ షాపులకు దాఖలైన 1,958 దరఖాస్తుల నుంచి తీసిన లక్కీ డ్రాలో ఇప్పుడున్న దుకాణాదారులు పూర్తిగా అవకాశం కోల్పోయారు. జనగామలో 50 షాపులకు వచ్చిన 1,697 దరఖాస్తుల్లో సిండికేట్‌గా ఏర్పడిన కొందరు 250 వరకు వేశారు. వారిని సైతం తీవ్ర నిరాశకు గురి చేసింది. మహబూబాబాద్‌లో 61 దుకాణాల కోసం 1,800 దరఖాస్తులు వేశారు. అందులో 1,739 దరఖాస్తుదారులు భంగపడ్డారు. భూపాలపల్లి, ములుగు జిల్లాలకు సంబంధించి 1,863 దరఖాస్తుల నుంచి 59 మందినే దుకాణాలు వరించాయి. వరంగల్, హనుమకొండ జిల్లాలకు చెందిన వ్యాపారులు ఇక్కడ దరఖాస్తు చేసుకున్నా చాలా వరకు నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలోనే సిండికేట్‌గా ఏర్పడినా ఫలితం లేని వారంతా ‘గుడ్‌విల్’ ఇచ్చి వైన్స్‌షాపులను పొందే పనిలో పడ్డారు.
మేడారం, లోకల్ ఎన్నికల డిమాండ్
వాస్తవానికి ఎవరి పేరు మీద లైసెన్స్ ఉంటే వారే నడపాల్సి ఉన్నా.. గత సీజన్ నుంచి ఈ వ్యాపారంలో కొత్త ట్రెండ్ మొదలైంది. నిబంధనలకు వ్యతిరేకమైనా వ్యాపారులు లెక్క చేయడం లేదు. లైసెన్సుల మాటున కొత్త దందా జరుగుతోంది. కొత్త దుకాణాలకు లైసెన్సులు జారీ అవుతున్న వేళ ఈ కొత్త వ్యాపారం బయటకు వస్తోంది. లాటరీ వచ్చి దుకాణం దక్కించుకున్న వారికి భారీ ఆఫర్లు వస్తున్నాయి. భారీ అమ్మకాలు సాగే ప్రాంతాల్లో వీరికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ప్రధానంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఈసారి అధిక లిక్కర్ విక్రయాలు జరగనున్నాయి. ఈ ఏడా ది చివరి నుంచి వచ్చే ఏడాదంతా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలతోపాటు సింగిల్‌విండో, ము న్సిపల్ తదితర స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో మద్యం అమ్మకాలు విపరీతంగా ఉంటాయని వ్యాపారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దరఖాస్తుల సమయంలోనే సిండికేట్‌గా ఏర్పడి పెద్ద సంఖ్యలో దాఖలు చేసినప్పటికీ.. ఆ మేరకు దుకాణాలు రాలేదు. దీంతో గుడ్‌విల్ దందాకు తెరతీయడం చర్చనీయాంశం అవుతోంది.
రూ.3 లక్షలకు.. రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు డీల్
యఽథేచ్ఛగా ‘సిండికేట్‘ల దందా...
‘మేడారం’, లోకల్ ఎన్నికలే కారణం
ఈ నెలాఖరు వరకే 2023–25
సంవత్సరం టెండర్ల కాలం
డిసెంబర్ 1 నుంచి దుకాణాలు
నడిపేలా ‘సిండికేట్’ల వ్యూహం
ఉమ్మడి వరంగల్‌లో పడగ విప్పిన మద్యం మాఫియా
మంగళవారం శ్రీ 11 శ్రీ నవంబర్ శ్రీ 2025
మంగళవారం శ్రీ 11 శ్రీ నవంబర్ శ్రీ 2025
మంగళవారం శ్రీ 11 శ్రీ నవంబర్ శ్రీ 2025


