
ప్లీజ్ మేడం..
పరకాలలో పనిచేయలేకపోతున్నా..!
సెలవుపై వెళ్లిన కమిషనర్ వెంకటేష్
ఫిబ్రవరిలో బాధ్యతల స్వీకరణ..
గత ఫిబ్రవరిలో పరకాల మున్సిపల్ కమిషనర్‌గా సీహెచ్.వెంకటేష్ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత వివిధ అభివృద్ధి పనుల్లో రాజకీయ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధుల అతిజోక్యంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అదే విధంగా అధికార పార్టీకి చెందిన నాయకులు చిన్న చిన్న విషయాలను సైతం స్థానిక ముఖ్యప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లడం, కార్యాలయంలో కొందరు ఉద్యోగుల ప్రవర్తన ఇబ్బందికరంగా మారి ఉన్నతాధికారులకు సంజాయిషీలు ఇచ్చుకోవాల్సి న పరిస్థితులు ఎదుర్కొన్నారు. వీటిపై ఆయన కొంత మనస్తాపం చెందినట్లు సమాచారం. ఇన్ని ఒత్తిళ్ల నేపథ్యంలో కలెక్టర్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. ఆయన కోరిక మేరకు దీర్ఘకాలిక సెలవులకు కలెక్టర్ అనుమతి ఇవ్వడంతో ఇన్‌చార్జ్ కమిషనర్‌గా టౌన్‌ప్లానింగ్ అధికారి సుష్మకు శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు బాధ్యతలు అప్పగించారు. దీంతోపాటు తనసెల్‌ఫోన్ సిమ్‌ను కూడా అందజేసి కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. ఒకవైపు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాగా మరికొద్ది రోజుల్లో వార్డు అధికారులంతా తమ సొంత శాఖకు వెళ్లిపోనున్న దృష్ట్యా రెండోసారి ఇన్‌చార్జ్ కమినర్‌గా బాధ్యతలు చేపట్టిన సుష్మకు ఓ సవాల్ అనే చెప్పొచ్చు.
పరకాల: ఒకవైపు ఉన్నతాధికారుల ఒత్తిళ్లు.. మరోవైపు స్థానిక రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు అతిజోక్యం వెరసి పరకాల మున్సిపల్ కమిషనర్ పోస్టు ఓ ముళ్ల కిరీటమైంది. ఇక్కడ పనిచేయడమంటేనే అధికారులకు ఓ సవాల్‌గా మారింది. పదేళ్ల పరకాల మున్సిపల్ చరిత్రలో 12 మంది కమిషనర్లు మారడమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. రెండు వారాల క్రితమే సెలవుపై వెళ్లి వచ్చిన పరకాల మున్సిపల్ కమిషనర్ సీహెచ్.వెంకటేష్ మళ్లీ సెలవుపై వెళ్తూ తన బాధ్యతలను టౌన్‌ప్లానింగ్ అధికారి సుష్మకు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు శుక్రవారం ఆయన.. కలెక్టర్ స్నేహ శబరీష్‌ను స్వయంగా కలిసి స్థానికుడిగా తాను పరకాల మున్సిపల్‌ను కోరుకుని తప్పిదం చేసినట్లు అయ్యిందని, పూర్తిస్థాయిలో తన ఉద్యోగానికి న్యాయం చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. తనను ఇక్కడినుంచి బదిలీ చేయాలని కోరినట్లు తెలిసింది.
కలెక్టర్ ఎదుట మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ గోడు
దీర్ఘకాలిక సెలవుకు అంగీకరించిన కలెక్టర్
ఇన్‌చార్జ్ కమిషనర్‌గా టీపీఓ సుష్మకు బాధ్యతలు
కమిషనర్లపై రాజకీయ పెత్తనం.. ప్రజల్లో విమర్శలు

ప్లీజ్ మేడం..

ప్లీజ్ మేడం..