
ముల్కనూరు సొసైటీ ఎన్నికలు ఏకగ్రీవం
ఎల్కతుర్తి: సహకార రంగంలో పేరుగాంచిన ముల్కనూరు సొసైటీ ఎన్నికలు బుధవారం ఏకగ్రీవమయ్యాయి. ముల్కనూరు సహకార సంఘంలో ఇటీవల ఐదు డైరెక్టర్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా 11 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో ఆరు నామినేషన్‌న్లు ఉపసంహరించుకోగా బుధవారం ఎన్నికలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి కె.కోదండరాములు తెలిపారు. ఒకటో డైరెక్టర్ స్థానం అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, రెండో డైరెక్టర్ స్థానం బొల్లంపల్లి కుమారస్వామి, ఐదో డైరెక్టర్ స్థానం గనవేన శ్రీనివాస్, తొమ్మిదో డైరెక్టర్ స్థానం గుర్రాల భాస్కర్‌రెడ్డి, 15వ డైరెక్టర్ స్థానంలో కాసిరెడ్డి వసంత ఎన్నికై నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, బ్యాంకు అధ్యక్షుడు ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ప్యానల్ విజయకేతనంతో సంబురాలు చేసుకున్నారు.