విమానాశ్రయానికి మరో అడుగు | - | Sakshi
Sakshi News home page

విమానాశ్రయానికి మరో అడుగు

Jun 10 2025 3:32 AM | Updated on Jun 10 2025 3:32 AM

విమానాశ్రయానికి మరో అడుగు

విమానాశ్రయానికి మరో అడుగు

సాక్షి, వరంగల్‌: మామునూరు ఎయిర్‌పోర్ట్‌ పునర్నిర్మాణానికి అవసరమైన భూ సేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈనేపథ్యంలో సమీప గ్రామాల ప్రజల నుంచి సేకరించే భూమికి పరిహారం నిర్ణయించడం.. అందుకు భూనిర్వాసితులు సానుకూలత వ్యక్తం చేయడంతో విమానాశ్రయ నిర్మాణానికి మరో అడుగు పడినట్లయ్యింది. కలెక్టర్‌ సత్యశారద నేతృత్వంలోని జిల్లా చర్చల కమిటీ నిర్వాసితులతో చర్చింది. వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.కోటి 20 లక్షలు, వ్యవసాయేతర భూములకు చదరపు గజానికి రూ.4,887 ఇస్తామని, అంతకు మించి పెంచే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. దీంతో నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి భూనిర్వాసితులు భూములు ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. వీరిలో గుంటూరుపల్లికి చెందిన కొందరు రైతులు తమ భూములు మెయిన్‌ రోడ్డుకు ఉన్నాయని, ఇంకాస్త ఎక్కువ ధర వస్తుందన్న ఆలోచనలో ఉన్నవారితో తహసీల్దార్‌, ఆర్‌ఐ తదితరులు చర్చించి ఎక్కువ ధర ఇచ్చే అవకాశం లేదని చెప్పారు. కలెక్టర్‌ తనకున్న విచక్షణాధికారాలతో జనరల్‌ అవార్డు కింద రూ.65లక్షలు ఉంటే కన్సంట్‌ అవార్డు కింద రూ.కోటి 20లక్షల వరకు తీసుకొచ్చారని వివరించారు. ఇదిలా ఉండగా.. 253 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 205 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. తాజా గా కలెక్టర్‌ సత్యశారద నిర్ణయంతో మరో రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్లు అదనంగా అవసరం కానుండడంతో ఇప్పటికే ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక సమర్పించినట్లు తెలిసింది.

భూసేకరణ కాగానే పనులు మొదలు..

ఇప్పటికే ఎయిర్‌పోర్ట్‌ పరిధిలో 696.14 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి అదనంగా మరో 253 ఎకరాల భూమిని 136 మంది రైతుల నుంచి సేకరించాల్సి ఉండగా, అది కూడా పూర్తి కావొచ్చింది. భూ నోటిఫికేషన్‌ ప్రకారం రైతులు తమ భూపత్రాల వివరాలు ఇవ్వగానే, వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూనే భూమి సేకరించనుంది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించారు. ఈవిమానాశ్రయం అందుబాటులోకి వస్తే 150 నుంచి 186 మంది ప్రయాణించే వీలున్న 37.6 మీటర్లు పొడవున్న ఏ–320, బీ–737 విమానాలు రాకపోకలు సాగించనున్నాయి.

ధరల నిర్ణయాలపై మెజార్టీ నిర్వాసితుల సానుకూలత

వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.కోటి 20 లక్షలు..

వ్యవసాయేతర భూములకు గజానికి రూ.4 వేలకు పైగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement