గీసుకొండ: మండలంలోని జాతీయ ఆదర్శగ్రామం గంగదేవిపల్లిని కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు చెందిన 26 మంది అధికారులు సోమవారం ఉద్యోగ పరమైన శిక్షణలో భాగంగా సందర్శించారు. ఇండియా సెక్రెటేరియట్ ఇన్‌స్టిట్యూట్ మేనేజ్‌మెంట్ (ఐఎస్‌టీఎం) అసిస్టెంట్ డైరెక్టర్ కిషోర్‌సోనీ ఆధ్వర్యంలో ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీఐ మహా నిర్దేశకులు శశాంక్ గోయల్ సూచనల మేరకు అధికారుల బృందం గ్రామ సందర్శనకు వచ్చింది. ఈసందర్భంగా గ్రామం సాధించిన విజయాలు, ప్రజల భాగస్వామ్యంతో ఆదర్శంగా నిలిచిన తీరు గురించి జిల్లా ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళి వారికి వివరించారు. ఐఎస్‌టీఎం డైరెక్టర్ రాజీవ్, హెచ్‌ఐఆర్డీ అధికారి మార్గం కుమారస్వామి, రిసోర్స్‌పర్సన్ గూడ సరోజన, మిషన్ భగీరథ సిబ్బంది పాల్గొన్నారు.