31న ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం | - | Sakshi
Sakshi News home page

31న ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం

Mar 30 2023 1:46 AM | Updated on Mar 30 2023 1:46 AM

- - Sakshi

కేయూ క్యాంపస్‌: కాకతీయ విశ్వవిద్యాలయం భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘మెట్‌ల్యాబ్స్‌ అండ్‌ ఇట్స్‌ అప్లికేషన్‌’ అనే అంశంపై ఈ నెల 31న ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు విభాగాధిపతి సీజే శ్రీలత, పాఠ్య ప్రణాళిక అధ్యక్షురాలు డాక్టర్‌ జి.పద్మజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 31 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. కేయూలోని ఫిజిక్స్‌ విభాగ సెమినార్‌ హాల్‌లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీసీ తాటికొండ రమేష్‌, సైన్స్‌ విభాగాల డీన్‌ పి.మల్లారెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు.

కీర్తి పురస్కారం

అందుకున్న రామేశ్వరం

కేయూ క్యాంపస్‌: కేయూ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం రిటైర్డ్‌ ఆచార్యులు, హనుమకొండలోని ప్రకాశ్‌రెడ్డిపేటలో అంతర్జాతీయ ప్రకృతి వైద్య సాహిత్య గ్రంథాలయం వ్యవస్థాపకులు గజ్జల రామేశ్వరం బుధవారం హైదరాబాద్‌లో ని పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయంలో కీర్తిపురస్కారం అందుకున్నారు. ప్రకృతివైద్యంపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న రామేశ్వరా న్ని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. పొట్టిశ్రీరాములు యూనివర్సిటీ వీసీ తంగెడ కిషన్‌రావు, రిజిస్ట్రార్‌ రమేష్‌, తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ శ్రీధర్‌ల చేతులమీదుగా ఆయన ఈ పురస్కారం అందుకున్నారు.

సీకేఎం మట్టిలోనే

త్యాగం ఉంది : వీసీ రమేష్‌

వరంగల్‌: చందా కాంతయ్య స్మారక కళాశాల (సీకేఎం) మట్టిలోనే త్యాగం ఉందని కేయూ వీసీ తాటికొండ రమేష్‌, ప్రముఖ పాటల రచయిత మిట్టపల్లి సురేందర్‌లు అన్నారు. దేశాయిపేటలోని సీకేఎం కళాశాలలో బుధవారం జరిగిన ‘చైతన్య ఉత్సవం’(కాలేజ్‌ డే) కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు ఈ మట్టినుంచి జయశంకర్‌ సార్‌... వరవరరావు లాంటి వ్యక్తులు వచ్చారన్నారు. చందా విజయ్‌ కుమార్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ సుధాకర్‌రెడ్డిలు సందేశం అందజేశారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు చందా శ్రీకాంత్‌, ఎన్‌సీసీ ఆఫీసర్‌ కెప్టెన్‌ డాక్టర్‌ పి.సతీష్‌కుమార్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, లైబ్రేరియన్‌ అనిల్‌కుమార్‌, కల్చరల్‌ కోఆర్డినేటర్‌ అరుణ, అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

ఎస్సారెస్పీ క్యాంప్‌నకు

రిజిస్ట్రేషన్‌ కార్యాలయం!

భవనాల పరిశీలన..

హసన్‌పర్తి: కేయూసీ–కాజీపేట రోడ్డులోని వడ్డెపల్లి చెరువు సమీపంలో ఉన్న జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాన్ని చింతగట్టు ఎస్సారెస్పీ క్యాంపునకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు క్యాంప్‌లో నిరుపయోగంగా ఉన్న భవనాలను ఆ శాఖ ఉద్యోగులు బుధవారం పరిశీలించారు. గతంలోఎస్సారెస్పీ–2 కార్యాలయాలు నిర్వహించిన రెండు భవనాలతోపాటు డివిజన్‌–4 భవనం ఉంది. ఇందులో ఓ భవనంలో పరకాల సబ్‌ డివిజన్‌కు సంబంధించిన కార్యాలయాన్ని తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా హసన్‌పర్తిలోని సంస్కృతి విహార్‌లో కూడా ప్రభుత్వ భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి. పదేళ్ల క్రితం ఓ భవనాన్ని నిర్మించినప్పటికీ ఇప్పటివరకు ప్రారంభించలేదు. దీనిని కూడా పరిశీలించనున్నట్లు తెలిసింది. ఏ భవనం అనుకూలమో గుర్తించాక కార్యాలయ తరలించేందుకు అనుమతి కోసం కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రిజిస్ట్రేషన్‌శాఖ ఉద్యోగులు తెలిపారు.

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement