వైభవంగా నాగ సుబ్రమణ్య శూల ప్రతిష్ట | - | Sakshi
Sakshi News home page

వైభవంగా నాగ సుబ్రమణ్య శూల ప్రతిష్ట

Nov 30 2026 12:17 AM | Updated on Nov 30 2026 12:17 AM

కొత్తకోట రూరల్‌: మండలంలోని కానాయపల్లి స్టేజీ సమీపంలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రం కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో శనివారం ఆదిశేష సహిత నాగ సుబ్రమణ్య శూల ప్రతిష్ట మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. స్వర్ణకవచ పంచలోహ శివలింగ నిలయం ఎదుట ఉన్న వృక్షం కింద నిర్వహిస్తున్న కార్యక్రమంలో తొలిరోజు కాలసర్ప హోమాలు నిర్వహించారు. ఆదివారం ప్రధాన ప్రతిష్ట మహోత్సవం ఉంటుందని.. ఈ కార్యక్రమానికి నేరేడుగాం పశ్చిమాద్రి మఠాధిపతి సిద్ధిలింగ శివాచార్య మహాస్వామి, బిజ్వార్‌ పీఠాధిపతి ఆదిత్య పరాశ్రీ హాజరుకానున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement