వనపర్తి
అంటరానితనం నుంచి ఆత్మగౌరవం దాకా..
● ఉద్దాల పూజలో అణగారిన వర్గాలకు అగ్రస్థానం
● కులవృత్తులే దైవసేవగా.. సామాజిక సమరసతకు కురుమూర్తి క్షేత్రం ప్రతీక
● శ్రమజీవుల భాగస్వామ్యంతో ప్రత్యేక గుర్తింపు.. పేదల తిరుపతిగా ప్రసిద్ధి
జాతర.. జనసంద్రం
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి
తరలివచ్చిన భక్తులతో కురుమూర్తిస్వామి జాతర జనసంద్రంగా మారింది.
ఆదివారం శ్రీ 29 శ్రీ నవంబర్ శ్రీ 2026
–8లో u
కులవివక్ష గోడలు ఇంకా పూర్తిగా కూలిపోని సమాజంలో.. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక ఆధ్యాత్మిక సంప్రదాయం సమానత్వానికి సరికొత్త
అర్థాన్నిస్తోంది. ఏడు కొండల నడుమ కొలువైన పాలమూరు పేదల తిరుపతి కురుమూర్తి వేంకటేశ్వరస్వామి క్షేత్రం సామాజిక సమరసతకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఒకప్పుడు అంటరానితనం పేరుతో సమాజానికి దూరంగా ఉంచిన చేతులే.. నేడు స్వామివారి ఉత్సవంలో అత్యంత పవిత్రమైన ఉద్దాల
(పాదుకల) తయారీ, పూజా కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కులవృత్తులే దైవసేవలుగా మారి, వివిధ సామాజిక వర్గాలు తమవంతు బాధ్యతలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న తీరు ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతోంది. – చిన్నచింతకుంట/మదనాపురం
ప్రతి కులవృత్తీ.. స్వామివారి సేవలో భాగమే


