వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయములో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 25 వినతులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు నేరుగా అదనపు ఎస్పీ రాజేష్ మీనాను కలిసి వినతులు అందజేశారు. ఏఎస్పీ ఫిర్యాదును స్వయంగా పరిశీలించి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నేడు 2కే రన్
వనపర్తి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు మంగళవారం ఉదయం జిల్లాకేంద్రంలో 2కే రన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి మందిరంలో ఎస్‌ఐఆర్‌పై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఉదయం 6 గంటలకు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానం నుంచి కొత్త బస్టాండ్ మీదుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు రన్ కొనసాగుతోందని.. ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు భారీగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. ప్రజలందరూ ఎస్‌ఐఆర్‌లో భాగస్వాములై తమ ఓటును జాబితాలో నమోదు చేసుకునే విధంగా విస్తృత ప్రచారం కల్పించాలని, అందులో భాగంగా 2కే రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బీఎల్వోలు జూన్ 25 నుంచి జులై 31 వరకు ఇల్లిల్లూ తిరిగి ఓటరు నమోదు చేపడతారని.. ఇప్పటికే ఓటర్లుగా నమోదైన వారు, 1–10–2026 నాటికి 18 ఏళ్లు నిండిన యువత సైతం ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇవే విషయాలను జిల్లాలోని ఓటర్లందరికీ అర్థమయ్యే విధంగా వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.
ఉత్తమ ఫలితాలు సాధించాలి : డీఈఓ
వనపర్తి రూరల్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఇన్‌చార్జ్ జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు. సోమవారం మండలంలోని చిట్యాల జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ప్రధానోపాధ్యాయుడు గణేష్‌కుమార్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకా లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ప్రతి ఉపాధ్యాయుడు తన బాధ్యతను గుర్తించి సమయపాలన పాటిస్తూ విధులకు హాజరై విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంఓ శేఖర్, ఉపాధ్యాయులు సంజీవయ్య, గిరిరాజాచారి, రుద్రమదేవి, సాయిప్రకా ష్, రవి, జ్యోతిలక్ష్మి, మహ్మద్ షఫీ, శ్రీనివాసులు, స్వరూప, సీఆర్పీ రవి తదితరులు పాల్గొన్నారు.


