చెరువుల్లో దళారుల పాగా | - | Sakshi
Sakshi News home page

చెరువుల్లో దళారుల పాగా

Jun 22 2026 12:24 AM | Updated on Jun 22 2026 12:24 AM

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మత్స్యకారుల జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు. మార్కెటింగ్‌ కష్టాలు, అందని ఉచిత చేపవిత్తనా లు, బయట మార్కెట్లలో చేప విత్తనాల ధరల పెంపుతో నిస్సహాయ స్థితిలో దళారులను ఆశ్రయించే పరిస్థితి నెలకొంది. మత్స్యకారుల అవసరాలను ఆసరా చేసుకొని దళారులు చెరువుల్లో పాగా వేస్తున్నారు. వేలం పాటల్లో చెరువులు దక్కించుకొని తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క చేపల మార్కెట్‌ కూడా లేకపోవడంతో అమ్ముకోలేని దీనస్థితిలో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. సౌకర్యాల లేమితో రోడ్లపై చేపల విక్రయాలు చేస్తున్నా ప్రభుత్వాలు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తే మత్స్య శాఖ మంత్రిగా ఉన్నా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది.

స్టోరేజీ, మార్కెట్లు ఏవి?

జిల్లాలో ఉత్పత్తి అవుతున్న చేపలను అమ్ముకునేందుకు మార్కెట్లు, నిల్వ చేసుకునేందుకు కోల్డ్‌ స్టోరేజీలు లేక మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెటింగ్‌ కష్టాలను ఎదుర్కోలేని మత్స్యకారులు దళారులను ఆశ్రయించి చెరువులను వేలం ద్వారా విక్రయించడం జిల్లాలోని చాలా గ్రామాల్లో కనిపిస్తుంది. మహబూబ్‌నగర్‌, జడ్చర్ల పట్టణాల్లో గతంలో ఉన్న చేపల మార్కెట్లను తొలగించి.. వాటి స్థానంలో మున్సిపాలిటీల ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నా.. అవేమీ అందుబాటులోకి రాలేదు. అలాగే భూత్పూర్‌ మున్సిపాలిటీ సమీపంలో చేపల మార్కెట్‌కు ప్రభుత్వం 5 గుంటల భూమిని గతంలోనే కేటాయించగా.. నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేసింది. అయితే ఈ స్థలం అనువైనదిగా లేకపోవడంతో నిర్మాణ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఆయా పట్టణాల్లో చౌరస్తాలు, పలు కూడళ్లలో మత్స్యకారులు చేపల విక్రయాలు చేస్తున్నారు.

మత్స్య పారిశ్రామిక

సహకార సంఘాలు

పంపిణీ చేయాల్సిన చేప విత్తనాలు 1.92 కోట్లు

మొత్తం సభ్యులు 13,066

కోయిల్‌సాగర్‌

ప్రాజెక్టుతోపాటు చెరువులు,

కుంటలు 910

242

మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు

మొత్తం సభ్యులు

817

22

పంపిణీ చేసిన చేప విత్తనాలు 66,925

జిల్లా పరిధిలో ఇలా..

మత్స్యకారుల బలహీనతను ఆసరాగా చేసుకొని యథేచ్ఛగా వ్యాపారం

కొందరు అధికారుల సహకారంతో వేలం ద్వారా చెరువుల లీజు

జిల్లాలో మార్కెట్లు లేకపోవడమూ శాపంగా మారిన వైనం

తీవ్రంగా నష్టపోతున్న అర్హులైన మత్స్యకారులు

మరోవైపు చేప విత్తనాల పంపిణీలోనూ లక్ష్యాన్ని కుదిస్తున్న ప్రభుత్వం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement