వనపర్తి: సమస్త మానవాళికి భారత్ అందించిన అద్భుతమైన ఆరోగ్య సంపద యోగా అని ఏఎస్పీ రాజేష్ మీనా తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఎస్పీ కార్యాలయ పరేడ్ మైదానంలో కార్యాలయంలోని వివిధ విభాగాల్లో ఉన్న సుమారు 180 మంది పోలీసులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యకర జీవన విధానానికి యోగా చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం గంట సమయం వెచ్చించి యోగా చేయాలని సూచించారు. విధి నిర్వాహణ, ఇతర మానసిక వత్తిడి నుంచి చాలా ఉపశమనం కలిగిస్తోందన్నారు. ప్రస్తుత కాలంలో చిన్న వయస్సులోనే అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని, వాటిని దూరం చేయాలంటే యోగా ఒక్కటే మార్గమని తెలిపారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.


