పురపాలికలోని 10 వార్డుల్లో 100 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. 79 మందికి ప్రొసీడింగ్స్ అందించాం. వీరిలో 60 మంది లబ్ధిదారులు మార్కింగ్ పూర్తి చేసుకొని బేస్‌మెంట్ పనులు చేపడుతుండగా.. 12 మంది ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు. మిగిలిన వారిని కలిసి త్వరగా పనులు ప్రారంభించాలని అవగాహన కల్పిస్తున్నాం. – నూరుల్ నదీం,
పుర కమిషనర్, అమరచింత
జిల్లాలో 5,951 మంది ఇందిరమ్మ ఇంటి నిర్మాణ మంజూరు పత్రాలు అందుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిరంతరం గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు 1,264 మంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోగా.. 1,824 మంది లబ్ధిదారుల ఇళ్ల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. మంజూరు పత్రాలు అందుకున్న వారందరికి ఇంటి నిర్మాణం కోసం మార్కింగ్ ఇచ్చాం. నిత్యం లబ్ధిదారుల వద్దకు వెళ్లి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకునేలా అవగాహన కల్పిస్తూ విడతల వారీగా బిల్లులు చెల్లిస్తున్నాం.
– విఠోభా, జిల్లా హౌసింగ్ అధికారి


