
అర్హులందరికీ రేషన్ కార్డులు
వనపర్తి రూరల్: అర్హులందరికీ రేషన్‌కార్డు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం పెబ్బేరు, శ్రీరంగాపురంలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెబ్బేరు మండలంలో 2,014, శ్రీరంగాపురం మండలంలో 345 మందికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామని చెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో పేదలు రేషన్ కార్డుల కోసం ఎదురుచూసినా ప్రయోజనం లేకపోయిందని.. పాలకులే లబ్ధి పొందారు తప్పా ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు ప్రజలకు అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని.. పార్టీలకతీతంగా పారదర్శకంగా అర్హులందరికీ అందజేస్తామని తెలిపారు. మహిళలకు రూ.360 కోట్లు వడ్డీలేని రుణాలు మంజూరు చేశామని.. రంగసముద్రం దగ్గర టూరిజంశాఖ ఆధ్వర్యంలో పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. దేవాలయం వద్ద రథోత్సవ సమయంలో ఇబ్బందులు కలగకుండా రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తునట్లు తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, మార్కెట్ చైర్మన్ ప్రమోదిని, డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌యాదవ్, మార్కెట్ కమి టీ వైస్ చైర్మన్ ఎద్దుల విజవర్ధన్‌రెడ్డి, తహసీల్దార్లు మురళీగౌడ్, రాజు, నాయకులు అక్కి శ్రీనివాసులుగౌడ్, సురేందర్‌గౌడ్, దయాకర్‌రెడ్డి, వెంకట్రాములు, రంజిత్‌కుమార్ పాల్గొన్నారు.