మాట్లాడుతున్న డా. కె.రాజ్‌కుమార్
వనపర్తిటౌన్: పరిశోధనలతో విజ్ఞానవంతమైన సమాజం ఏర్పడుతుందని, నూతన ఆవిష్కరణలు జరుగుతాయని పాలమూరు యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. కె.రాజ్‌కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో పరిశోధన పద్ధతులు.. ప్రాజెక్టు రిపోర్టుపై నిర్వహించిన వర్క్‌షాపుకు ఆయనతో పాటు వాణిజ్యశాస్త్ర విభాగాధిపతి డా. ఎం.అనురాధరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు డిగ్రీస్థాయిలో పరిశోధనపై సరైన అవగాహన ఉంటుందని, దీంతో విజ్ఞాన వికాసం జరుగుతుందన్నారు. నిత్యజీవితంలో ఉన్నత విద్య ఎంతో ఉపయోగపడుతుందని.. అర్జించిన పరిజ్ఞానాన్ని సామాజిక సమస్యల పరిష్కారానికి వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్.శ్రీనివాస్, అధ్యాపకులు సురేందర్‌రెడ్డి, రమేష్, ఓబులేష్, సునీత, రఘునందన్, ఆంజనేయులు, స్వప్న, జమీల్‌పాషా తదితరులు పాల్గొన్నారు.


