సాక్షి ప్రతినిధి,.....

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులే టార్గెట్‌గా ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు దందా నిర్వహిస్తున్నారు. గురుకుల సీట్ల కోసం హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రైవేట్‌ పాఠశాలల నుంచి బోగస్‌ బోనఫైడ్‌ సర్టిఫికెట్లు సృష్టించి మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. అక్కడైతే గురుకులాలకు కాంపిటిషన్‌ తక్కువగా ఉంటుంది.. సీటు సులభంగా వస్తుందని అమాయక తల్లిదండ్రులతో నమ్మబలికి.. వారి నుంచి రూ.వేలు దండుకుంటున్నారు. ఒక్కొక్కరి వద్ద రూ.30వేల నుంచి రూ.50వేల వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. గురుకులాల్లో సీటు దక్కితే తమ పిల్లలు పదో తరగతి, ఇంటర్‌ వరకు విద్యతో పాటు హాస్టల్‌లో ఉచిత వసతి లభిస్తుందనే ఆశతో తల్లిదండ్రులు ఆర్థిక భారమైనా సమ ర్పించుకుంటున్నారు. ఎడ్యుకేషన్‌ హబ్‌గా రూపాంతరం చెందిన వనపర్తి జిల్లాకేంద్రంగా రెచ్చిపోతున్న విద్యా మాఫియాపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..

ఎక్కడెక్కడ.. ఎలా అంటే..

ప్రాథమికోన్నత పాఠశాలలుగా అనుమతులు తీసుకున్నప్పటికీ.. పలు యాజమాన్యాలు హాస్టల్‌ వసతి ఏర్పాటు చేసి అనధికారికంగా కోచింగ్‌ సెంటర్లు నిర్వహిస్తున్నాయి. ఇలా వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు మండలాల్లో కోచింగ్‌ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. వాటి నిర్వాహకులు గురుకుల, నవోదయ, సైనిక్‌ స్కూల్‌ తదితర పోటీ పరీక్షలకు అనువైన విద్యార్థులను ఎంపిక చేసుకుని శిక్షణ ఇస్తున్నారు. ప్రధానంగా ఐదు నుంచి ఏడో తరగతి స్టూడెంట్లను చేర్పించుకుంటున్నారు. ఆ తర్వాత నోటిఫికేషన్‌లో పేర్కొన్న వయసు మేరకు బోగస్‌ బోనఫైడ్‌లు సృష్టిస్తున్నారు. వయసు తక్కువ ఉన్నా.. ఎక్కువ ఉన్నా.. సర్టిఫికెట్లలో నిర్దేశిత వయసు ప్రకారం పుట్టిన తేదీ, నెల, సంవత్సరం మార్చి పోటీ పరీక్షలకు దరఖాస్తు చేపిస్తున్నారు.

వనపర్తి

గురువారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2023

Read latest Wanaparthy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top