స్థానిక ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

Oct 16 2026 1:06 AM | Updated on Oct 16 2026 1:06 AM

విజయనగరం గంటస్తంభం: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్మకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో గురువారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఓటర్ల జాబితాల పరిశీలన, పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని, పోలింగ్‌ సామగ్రి, బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ, కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూములు, వాహనాల ఏర్పాటు చేసి, ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేయాలని, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాలని ఆదేశించారు. సమావేశాల్లో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతుమాధవన్‌, జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్‌ సత్తిబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

జిల్లాలో 100 శాతం టెలికాం కనెక్టివిటీకి చర్యలు

● 37 మొబైల్‌ టవర్‌ సైట్ల కేటాయింపు

విజయనగరం గంటస్తంభం: జిల్లాలో 100 శాతం టెలికాం కనెక్టివిటీ లక్ష్య సాధనకు చర్యలు చేపడుతున్నట్టు జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతుమాధవన్‌ తెలిపారు. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్స్‌ శాఖ ప్రభుత్వ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు గురువారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా టెలికాం కనెక్టివిటీ, డిజిటల్‌ భారత్‌నిధి(డీబీఎన్‌) ప్రాజెక్టుల పురోగతి, మొబైల్‌ టవర్ల ఏర్పాటుకు భూకేటాంపులు, పెండింగ్‌ అనుమతులపై సమీక్షించారు. జిల్లాలో మొత్తం 37 మొబైల్‌ టవర్‌ సైట్లను కేటాయించగా, బీఎస్‌ఎన్‌ఎల్‌కు 15, ఎయిర్‌టెల్‌కు 13, జియోకు 6, వొడాఫోన్‌ ఐడియాకు 3 కేటాయించామన్నారు. వీటిలో 12 చోట్ల క్షేత్ర పరిశీలన, భూమి కోఆర్డినేట్ల నిర్ధారణ పూర్తయ్యాయని, ఎనిమిది సైట్లకు భూమి అప్పగింత ధ్రువీకరణ పత్రాలు అందాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement