● శాసన మండలి విపక్షనేత
బొత్స సత్యనారాయణ
బొండపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటి పార్టీకి పూర్వ వైభవం తీసుసుకురావాలని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ గజపతినగరం ఇన్చార్జి బొత్స అప్పలనరసయ్య అన్నారు. మండలంలోని చిన్నతామారపల్లి మాజీ సర్పంచ్, టీడీపీ సీనియర్ నాయుకుడు పిళ్లా గురునాయుడుతో పాటు అతని అనుచరులు రెడ్డి సత్తిబాబు, పిళ్లా రామునాయుడుతో పాటు 50 కుటుంబాలు టీడీపీ వీడి వైఎస్సార్సీపీలో చేరాయి. అలాగే బి.రాజేరు గ్రామంలో టీడీపీ నుంచి ఆ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ ఈదుబిల్లి కృష్ణ వర్గానికి చెందిన నాయకులు లచ్చిరెడ్డి ఎర్రి నాయుడుతో పాటు చొక్కాకుల అప్పలనాయుడు, 10 కుటుంబాలు వారు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి బొత్స పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నా ఇంత వరకు రైతులను ఆదుకోనే ఒక్క చర్య తీసుకోలేదని బొత్స మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చల్లా చలంనాయుడు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.వి.ప్రభూజీరాజు, పార్టీ యువ నాయకుడు బొత్స సాయిగురునాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు బొద్దల చిన్నంనాయుడు, నాయకులు సాలాపు పెంటంనాయుడు, మహంతి రమణ, కర్రోతు శ్రీనివాసరావు, బోడసింగి జగదీశ్వరరావు, వేమలి వెంకటరావు, బొడ్డు మాధవ్, తదితరులు పాల్గొన్నారు.


