విజయనగరం | - | Sakshi
Sakshi News home page

విజయనగరం

Jun 15 2026 7:40 AM | Updated on Jun 15 2026 7:40 AM

సోమవారం శ్రీ 15 శ్రీ జూన్‌ శ్రీ 2026 పేదల బియ్యం పందికొక్కుల్లా..! చేతులెత్తేసిన జైకా..

న్యూస్‌రీల్‌

అధోగతిలో సాగునీటి కాలువలు

తోటపల్లి ఆయకట్టుకు తప్పని కష్టాలు

ఆధునికీకరణ లేని మడ్డువలస కాలువలు

చేతులెత్తేసిన నారాయణపురం జైకా ఏజెన్సీ

ఖరీఫ్‌లో కష్టాలు తప్పవా..!

సోమవారం శ్రీ 15 శ్రీ జూన్‌ శ్రీ 2026

రామభద్రపురంలో పీడీఎస్‌ బియాన్ని ఆటోలో అక్రమంగా తరలిస్తుండగా సీఎస్‌డీటీ

పట్టుకున్నారు. 8లో

రాజాం మండలం బొద్దాం వద్ద అధ్వానంగా తోటపల్లి ప్రధాన కాలువ

రాజాం:

కప్పుడు కళకళలాడే సాగునీటి కాలువలు గత రెండేళ్లుగా ఆయకట్టు రైతులకు కన్నీటిని తెచ్చిపెడుతున్నాయి. సకాలంలో వర్షాలు పడితే పర్వాలేదు అన్న చందంగా వ్యవసాయం సాగుతోంది. సాగుకు అండగా ఉండాల్సిన సాగునీటి కాలువల్లో పూడికలు తీయక, కాలువ గట్లు బలహీనంగా మారడం, ప్రాజెక్టుల్లో సరిపడే నీటి మట్టం సక్రమంగా ఉంచకపోవడం, ప్రతీ ఏడాది చేపట్టాల్సిన నిర్వాహణ పనులు చేయకపోవడంతో ఆయకట్టు రైతులకు నీరు కనికట్టుగా మారుతోంది. ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓ అండ్‌ ఎమ్‌) వర్క్‌లతో టీడీపీ కార్యకర్తలకు ఉపయోగపడే పనులు మినహా కాలువలో పూర్తి స్థాయిలో ఇరిగేషన్‌ శాఖ నిధులు విడుదల కాకపోవడం, పనులు చేయకపోవడం రైతులకు తలనొప్పిగా మారుతోంది. ప్రధానంగా రాజాం నియోజకవర్గంలో పంటల సాగుకు ఆధారమైన సాగునీటి కాలువల పరిస్థితి దయనీయంగా మారింది. ఖరీఫ్‌లో రైతులకు సాగునీటి కష్టాలు తప్పవన్నట్టుగా పరిస్థితులు మారాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement