వంగర మండలంలోని గొర్లె శ్రీరాములనాయుడు మడ్డువలస ప్రాజెక్టు ద్వారా వంగర, రేగిడి, సంతకవిటి మండలాల్లో 19 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందాల్సి ఉంది. కాలువలో ఎక్కడికక్క డే ప్రాజెక్టు ద్వారా వరదల సమయంలో వచ్చిన గుర్రపుడెక్క చేరింది. ఇది కాలువలతో పాటు పరిస ర ప్రాంతాల్లో దిబ్బలుగా ఏర్పడి నీరు ప్రవహించని పరిస్థితి ఉంది. ప్రధాన కాలువతో పాటు పిల్ల కాలు వలు సైతం గుర్రపుడెక్క, రెల్లిగడ్డి, నల్లతుమ్మ వంటి కలుపుజాతి మొక్కలతో అస్తవ్యస్తంగా మారింది. కాలువలో పరిసర గ్రామాల రైతులు ఉపాధి పను లు ద్వారా వీటిని ప్రతీ ఏడాది తొలగించేవారు. ఈ ఏడాది ఆ పనులు లేవు. కాలువలో ఆధునికీకరణ తోపాటు ఇతర అభివృద్ధి పనులు ప్రభుత్వం చేయ కపోవడంతో పాటు ఇరిగేషన్ శాఖ నిర్వహణను పక్కన పడేసింది. ఖరీఫ్‌లో ఈ కాలువ ద్వారా థైలాండ్ ప్రాంతాలతో పాటు ఆయకట్టుకు కూడా సాగునీరు అందని పరిస్థితి కనిపిస్తోంది. గతేడాది ఖరీఫ్ ప్రారంభైన తరువాత ఆబరాగాబరగా ఓ అండ్ ఎమ్ ద్వారా రూ. 17 కోట్లతో కాలువలో పనులు చేసి మమ అనిపించారు. ఈ పనులు టీడీపీ కార్యకర్తలకు కలసివచ్చాయే తప్పా రైతుకు మేలు జరగదు.


