దారుణంగా ఓపెన్‌హెడ్‌ చానల్స్‌ | - | Sakshi
Sakshi News home page

దారుణంగా ఓపెన్‌హెడ్‌ చానల్స్‌

Jun 15 2026 7:40 AM | Updated on Jun 15 2026 7:40 AM

దారుణంగా ఓపెన్‌హెడ్‌ చానల్స్‌

రాజాం నియోజకవర్గంలో రాజాంలో సారధిగెడ్డ, రేగిడిలో ఏకెఎల్‌గెడ్డ, రేగిడి, సంతకవిటి మండలాల్లో సాయన్నగెడ్డలు ప్రధాన సాగునీటి కాలువ లు కంటే కూడా మంచిగా ఆయకట్టుకు సాగునీరు అందించే కాలువలుగా గతంలో ఖ్యాతి ఉండేది. ప్రస్తుతం ఈ కాలువలు ఆయకట్టుకు కూడా నీరు అందివ్వలేని పరిస్థితి ఉంది. ఓపెన్‌హెడ్‌ చానల్స్‌గా ఉన్న సాయన్న చానల్‌ పూర్తిగా కలుపుతో నిండిపోయింది. రేగిడి, సంతకవిటి మండలాల్లో వీటి షట్టర్లు పూర్తిగా పాడవ్వడం, మదుములు అంతరించిపోవడంతో ఖరీఫ్‌లో ఆయకట్టుకు పంట విషయం పక్కనపెడితే ముంపు అధికమౌతుంది. వరదలు నిత్యం ఆయకట్టును ముంచేస్తున్నాయి. గతంలో ఉపాధి పనులు నిర్వహించే ఈ కాలువల్లో ఈ ఏడాది ఆ పనులు కూడా లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజాంలో సారధిగెడ్డ ద్వారా ఆయకట్టుకు పూర్తిగా నీరు అందని పరిస్థితి ఉంది. రాజాం నుంచి సంతకవిటి మండలంలో మండాకురిటి వరకూ ఈ కాలువ ద్వారా 2 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందాల్సి ఉండగా, కాలువ పూర్తిగా నామరూపాలు లేకుండా పోయింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement