● నేటి నుంచి సముద్రంలో చేపల వేటకు గ్రీన్‌సిగ్నల్
● మత్స్యశాఖ నుంచి వెలువడిన ఉత్తర్వులు
పూసపాటిరేగ: మత్స్యసంపద వృద్ధిలో భాగంగా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో చేపల వేటను నిషేధించారు. గడువు ముగియడంతో చేపల వేటకు పచ్చజెండా ఊపుతూ మత్స్యశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 14వ తేదీ అర్ధరాత్రి నుంచి చేపలవేట సాగించుకోవచ్చని ఉత్తర్వు ల్లో పేర్కొన్నట్టు మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ లావణ్య తెలిపారు.
వేట సాగేదిలా..
జిల్లాలో భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో 21 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. మత్స్యకారులు 885 బోట్లలో వేట సాగిస్తు న్నట్లు రికార్డులు చెబుతున్నాయి. చింతపల్లిలో 412 బోట్లు, తిప్పలవలసలో 226, పతివాడబర్రిపేటలో 163, కోనాడలో 4 బోట్లు, తమ్మయ్యపాలెంలో 25, పులిగెడ్డలో10, ముక్కాంలో 91, చోడిపల్లిపేటలో 38, కొండ్రాజుపాలెంలో 60, చేపల కంచేరులో 91 బోట్లు ఉన్నాయి. వేటనిషేధ కాలానికి ప్రభు త్వ ఆంక్షలతో చాలామంది మత్స్యకారులకు వేట నిషేధ భృతి అందలేదు. ఇంజిన్ బోటుకు ఐదుగురు, సంప్రదాయ బోటుకు ముగ్గురు చొప్పున సాయం అందజేయడంతో అర్హులకు భృతి అందలేదని జిల్లా మత్స్యకార సహకార సంఘం మాజీ అధ్యక్షుడు బి.చిన అప్పన్న తెలిపారు.
నాకాబందీ
● శిక్షణ కానిస్టేబుళ్లతో వాహన తనిఖీలు
విజయనగరం క్రైమ్: విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లకు డెమోలో భాగంగా శనివారం ఏఆర్ ఏఎస్పీ కల్యాణ్ ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలో రెండు గంటల పాటు నాకాబందీ నిర్వహించారు. మొత్తం 160 మంది ట్రైనీ కానిస్టేబుళ్లు, 700 మంది పోలీస్ సిబ్బంది 150 చోట్ల వాహన తనిఖీలు చేపట్టారు. వై జంక్షన్, వీటీ అగ్రహారం, ఎత్తుబ్రిడ్జి, ఆర్‌అండ్‌బీ, మహిళా పోలీస్ స్టేషన్, కలెక్టరేట్, ద్వారపూడి బ్రిడ్జి, కంటోన్మెంట్, గూడ్స్ షెడ్, సీఎంఆర్ కూడలి, గంటస్తంభం, ఆర్టీసీ కాంప్లెక్స్, రింగ్‌రోడ్డు, కోట, సింహాచలం మేడ తదితర చోట్ల ఏకకాలంలో వాహనతనిఖీలు జరి పారు. వాహనదారుల వివరాలు నమోదుచేశారు. తనిఖీల్లో డీపీటీసీ డీఎస్పీ వీర్ కుమార్, ఏఆర్ డీఎస్పీ కోటిరెడ్డి, సీఐలు ఆర్.వి.కె.చౌదరి, శ్రీనివాస్, ఎస్‌ఐలు సురేంద్ర నాయుడు, మురళీ, కృష్ణమూర్తి, భవానీ, సూర్యకుమారి, లీలావతి, తదితరులు పాల్గొన్నారు.


