గజపతినగరం భారీ ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

గజపతినగరం భారీ ర్యాలీ

Jun 13 2026 1:29 PM | Updated on Jun 13 2026 1:29 PM

గజపతినగరంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో

జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ

కూటమి మోసపూరిత పాలనపై గజపతినగరం నియోజకవర్గ ప్రజలు నిరసన తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద నుంచి నాలుగు రోడ్ల కూడలిలోని వినాయకుని గుడి వరకు మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసుల ఆంక్షలను అధిగమిస్తూ ముందుకు సాగారు. ఇచ్చిన హామీలు అమలుచేయాలంటూ డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు సిరిపురపు జగన్మోహనరావు, ఎస్సీ, ఎస్టీసెల్‌ చైర్మన్‌ పీరుబండి జైహింద్‌కుమార్‌, పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మంత్రి అప్పలనాయుడు, నాలుగు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement