పార్వతీపురం రూరల్ : నవోదయం–2.0 కార్యక్రమంలో భాగంగా ఏపీ ఎకై ్సజ్ అధికారులు పొరుగు రాష్ట్రమైన ఒడిశాలో శుక్రవారం దాడులు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పార్వతీపురం ఏఈఎస్ ఎ.సంతోష్ ఆధ్వర్యంలో కోరాపుట్ జిల్లా బండుగం బ్లాక్ పరిధిలోని గ్రామాల్లో ఈ తనిఖీలు చేపట్టారు. ఒడిశాలోని గుణుపూర్ పోలీసుల సహకారంతో పార్వతీపురం ఎకై ్సజ్, ఈఎస్‌టీఎఫ్, విజయనగరం ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. దాడుల్లో అక్రమ మద్యం తయారీకి నిల్వ ఉంచిన 4 వేల లీటర్ల బెల్లం ఊట (ఎఫ్‌జే వాష్), 1000 కిలోల నల్లబెల్లం, 100 కిలోల అమ్మోనియా, 50 లీటర్ల సారాను గుర్తించి ధ్వంసం చేశారు. సరిహద్దుల్లో నిఘా ముమ్మరం చేశామని, అక్రమ మద్యం రవాణా, తయారీపై దాడులు కొనసాగుతాయని ఏఈఎస్ సంతోష్ స్పష్టం చేశారు.
4 వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం


