ప్రభుత్వ పాఠశాలలకు దాతలే దిక్కా...! | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలలకు దాతలే దిక్కా...!

Jun 11 2026 12:19 AM | Updated on Jun 11 2026 12:19 AM

–8లో

–8లో

అన్నీ ఉంటేనే తల్లికి వందనం..!

అన్నీ ఉన్నా అర్హుల నోట్లో శని అన్నట్లుంది సర్కారు తీరు. దీంతో తల్లికి వందనంపై ఆందోళన నెలకొంది.

అమ్మ ఒడి నుంచే అనంతలోకాలకు

పేగుతెంచి జన్మనిచ్చిన తల్లి తన బిడ్డను కళ్ల ముందే కోల్పోవడంతో తల్లడిల్లిపోయింది.

రామభద్రపురం:

జిల్లాలో రెండో విడత నాడు – నేడు పనులకు మంగళం పాడే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. చంద్రబాబు సర్కారు కొలువు దీరి రెండేళ్లు అయినా నేటికీ పాఠశాలల అభివృద్ధికి ఒక్క పైసాను సైతం విదల్చలేదంటే సర్కారు పాఠశాలలపై చంద్రబాబు ఎలా వ్యవహరిస్తున్నారో ఇట్టే అర్థమవుతోంది.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో జిల్లాలో రెండో విడత కింద పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు 738 ఎంపిక చేసి రూ.231 కోట్లతో పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేసింది. అయితే ఎన్నికల ముందు వరకు పనులు వేగంగా సాగినా, ఎన్నికల తర్వాత ఆ పనులు నిలిచిపోయాయి. ఆయా పాఠశాలల్లో పెండింగ్‌ పనులు సైతం చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలి నిర్దయగా వ్యవహరిస్తోంది. ఫలితంగా నిధుల్లేక జిల్లా వ్యాప్తంగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.

దాతలను గుర్తించాలంటూ ఆదేశాం..

ప్రభుత్వ స్కూళ్లలో మైనర్‌ రిపేర్లకు సైతం నిధులను విడుదల చేయకుండా దాతలను గుర్తించాలంటూ సమగ్రశిక్ష అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గుర్తించిన దాతల వివరాలను విద్యాంజలి పథకం పేరుతో డోనర్‌ యాప్‌లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. దాతల సహకారంతో పాఠశాలలను అభివృద్ధి చేసుకోవాలనే ఉచిత సలహా ఇస్తోంది.

ఈ తరుణంలో సంబంధిత అధికారులు దాతలను వెతికే పనిలో నిమగ్నమై ఉన్నారు. దాతల ముందుకొచ్చి మైనర్‌ రిపేర్లను పూర్తి చేయడం ఈ విద్యా సంవత్సరంలో సాధ్యం కాదనే భావన పలువురిలో వ్యక్తమవుతోంది.

పాఠశాలల్లో సమస్యలు..

జిల్లా వ్యాప్తంగా 1766 ప్రభుత్వ ప్రాధమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో ఇటీవల విద్యాశాఖాధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఏఏ సమస్యలు ఉన్నాయి.. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు ఏవి ప్రధానంగా కల్పించాలి? అన్న అంశాలపై పాఠశాలల హెచ్‌ఎంలను కోరింది. పాఠశాలల వారీగా హెచ్‌ఎంలు ప్రధాన సమస్యల వివరాలు అందించారు. 312 పాఠశాలల్లో విద్యార్థులకు తాగునీరు లేదని, 450 పాఠశాలల్లో ఆడపిల్లలకు మరుగుదొడ్లు, 440 పాఠశాలల్లో మగ పిల్లలకు మరుగుదొడ్లు కొరత ఉందని తెలిపారు. అలాగే ర్యాంప్స్‌ లేని పాఠశాలలు 282 ఉన్నాయని, 141 పాఠశాలల్లో విద్యుత్‌ సౌకర్యం లేదని, 167 పాఠశాలల్లో ఫర్నిచర్‌ కొరత ఉందని, 430 పాఠశాలలకు అదనపు తరగతి గదులు కావాలని, 630 పాఠశాలల్లో మేజర్‌, మైనర్‌ మరమ్మతులు చేయాలని సూచించారు. ప్రహరీలు, సైన్స్‌ ల్యాబ్‌లకు గదులు, కంప్యూటర్‌ రూంలు, కిచెన్‌ షెడ్‌లు అవసరమని పలు పాఠశాలల హెచ్‌ఎంలు నివేదిక ఇచ్చారు.

నాడు ఎంతో

సజావుగా..

రూ.488 కోట్లతో

ప్రతిపాదనలు

పంపించాం..

నాడు – నేడుకు చంద్రబాబు సర్కార్‌ మంగళం

మైనర్‌ మరమ్మతులకూ ఎదురు చూపులు

విద్యాంజలి పథకం పేరిట డోనర్‌ యాప్‌ కింద దాతల నమోదు

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి

రెండేళ్లైనా పైసా విదల్చని వైనం

ఎక్కడి పనులు అక్కడే...

అదనపు తరగతి గదులు, సరైన సదుపాయల్లేక విద్యార్థుల అవస్థలు

రేపే పాఠశాలల పునఃప్రారంభం

ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించాలని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయంలో నాడు–నేడు కార్యక్రమానికి అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. జిల్లాలో మొదటి విడత కింద 841 పాఠశాలలో రూ.185 కోట్లుతో చేసిన పనులతో తొమ్మిది రకాల వసతులు కల్పించింది. దీంతో విద్యార్థులు, ఉపాద్యాయులు, తల్లిదండ్రులు మారిన బడులను చూసి సంబరమాశ్చర్యాలకు లోనయ్యారు. తల్లిదండ్రులకు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్‌ స్కూళ్లలో చదువుతున్నామనే భావనను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కల్పించారు. ఇక రెండో విడత కింద పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు బాగుకు నిధులు మంజూరు చేసిన తరువాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం రావడంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి.

పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పాఠశాలలకు ఏఏ వసతులు అవసరమో ఎంఈవోల ద్వారా నివేదికలు తీసుకున్నాం. వాటికి ఇంజినీరింగ్‌ అధికారుల ద్వారా అంచనాలు వేయించి సుమారు రూ.488 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. నిధులు విడుదలైన వెంటనే పనులు ప్రారంభిస్తాం. ప్రభుత్వం విద్యాంజలి పేరుతో డోనర్‌ యాప్‌ను ఏర్పాటు చేసింది. అందులో పాఠశాలల్లో ఉన్న అవసరాలను పొందుపరిచాం. ఇందులో అదనపు తరగతి గదులు ఆవశ్యకత కూడా ఉంది. డోనర్‌ యాప్‌ ద్వారా దాతలు ముందుకొచ్చి ప్రభుత్వ బడుల అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాం.

– యు.మాణిక్యంనాయుడు, డీఈఓ, విజయనగరం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement