ఎఫ్‌ఎల్‌ఎన్‌ లక్ష్యాలను సాధించాలి | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఎల్‌ఎన్‌ లక్ష్యాలను సాధించాలి

Jun 10 2026 1:01 AM | Updated on Jun 10 2026 1:01 AM

దిశానిర్దేశం చేసిన డీఈవో

పార్వతీపురం రూరల్‌: ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి, రెండు తరగతులు చదువుతున్న విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందిస్తూ ఎఫ్‌ఎల్‌ఎన్‌ లక్ష్యాలను నూరుశాతం సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) పి.బ్రహ్మాజీరావు పేర్కొన్నారు. ఈ మేరకు పార్వతీపురంలోని డీవీఎం మున్సిపల్‌ హైస్కూల్‌లో ప్రాథమిక ఉపాధ్యాయులకు ఆరు రోజుల పాటు నిర్వహించిన ఎఫ్‌ఎల్‌ఎన్‌ శిక్షణ కార్యక్రమం మంగళవారం ముగిసింది. కోర్సు డైరెక్టర్‌, బలిజిపేట ఎంఇఓ–1 సామల సింహాచలం అధ్యక్షతన జరిగిన ముగింపు సభకు డీఈవో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నారుల్లో కనీస విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. శిక్షణ విజయవంతానికి సహకరించిన ఉపాధ్యాయులు, సంఘం నాయకులకు కోర్సు డైరెక్టర్‌ సింహాచలం ధన్యవాదాలు తెలిపారు. అనంతరం శిక్షణకు కీ రిసోర్స్‌ పర్సనన్స్‌ (కేఆర్పీలు)గా వ్యవహరించిన వనజాక్షి, జి.రవికుమార్‌లతో పాటు డీఆర్పీలను ఉపాధ్యాయ సంఘాలు ఉమ్మడిగా శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో బి.రాజకుమార్‌, ఏఎంవో కోటేశ్వరరావు, ఎంఈఓలు వై.విమలకుమారి, సూరిదేముడు, కర్రి ప్రసాదరావు, మువ్వల వెంకటరమణ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పువ్వుల ధనంజయరావు, గంట శశికుమార్‌, జగన్నాథం, కూర్మినాయుడు, రెడ్డి రమణ, ప్రసాదరావు, గోపాలకృష్ణ వివిధ మండలాల నుంచి వచ్చిన సుమారు 260 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement