సర్‌తో ఓటర్లకు శిరోభారమే..! | - | Sakshi
Sakshi News home page

సర్‌తో ఓటర్లకు శిరోభారమే..!

Jun 10 2026 1:01 AM | Updated on Jun 10 2026 1:01 AM

విజయనగరం అర్బన్‌: ప్రభుత్వాల మనుగడ, ప్రజల భవిష్యత్తును శాసించే ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ఇప్పుడు జిల్లాలో పెను సంచలనంగా మారింది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ‘స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌’ ప్రక్రియ పారదర్శకత పేరుతో సాగుతున్నప్పటికీ తెరవెనుక వేలాది మంది అర్హులైన ఓటర్ల హక్కుకు ముప్పు తెచ్చేలా ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఓటరుగా సజీవంగా ఉన్న సామాన్యుడికి ఈ ప్రక్రియ శాపంగా మారబోతోందా? అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

ఏజెంట్ల ఇష్టారాజ్యం–రాజకీయ పక్షపాతం?

ఈ సర్వేలో బూత్‌ లెవెల్‌ ఏజెంట్లదే (బీఎస్‌ఏ) కీలక పాత్ర కానుంది. ఇంటింటి సర్వేలో వారి సమ్మతి ప్రకారమే మార్పులు జరుగుతాయి. అధి కార పార్టీతో పాటు ప్రతిపక్షాలు తమకు అనుకూలమైన ఓటర్లను ఉంచుకుని, ప్రత్యర్ధి పార్టీల సానుభూతిపరుల ఓట్లను టార్గెట్‌ చేసే అవకాశం ఉంది. ఏజెంట్లు లేని ప్రాంతాల్లో ఓటర్ల జాబితా తారుమారయ్యే ప్రమాదం ఉంది. ఏజెంట్ల నియామకంలో ఫారం–2 పూరించడంతో జరుగుతున్న హడావుడి చూస్తుంటే అర్హులైన ఓటర్లు చేజారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

జిల్లాలో 1.5లక్షల మంది ఓట్లు గాల్లో కలిసే ప్రమాదం

ఫారం–2 నింపడం సామాన్యుడికి తలనొప్పి

ఏజెంట్ల ఇష్టారాజ్యంతో

ఓట్ల తొలగింపు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement