మద్యం మత్తు వల్లే రోడ్డు ప్రమాదాలు
రామభద్రపురం: మద్యం మత్తు, మితిమీరిన వేగం వల్లే అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ఈ మేరకు రామభద్రపురం పోలీస్ స్టేషన్‌ను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆవరణంతా కలియదిరిగి పరిశీలించారు. అలాగే వివిధ కేసులకు సంబంధించిన రికార్డులు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా తక్కువ సిబ్బంది ఉండడంతో పారాది కాజ్‌వే పాడవడం వల్ల భారీ లారీలు మళ్లించేందుకు ఇబ్బందులు పడుతున్నామని పోలీసులు ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ యువత మద్యానికి బానిసవడంతోనే అత్యాచారాలు, తల్లిదండ్రులపై హత్యలకు పాల్పడుతున్నారన్నారు. గ్రామాలలో బెల్ట్ దుకాణాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పోలీస్‌స్టేషన్‌కు పనుల నిమిత్తమో, లేక ఫిర్యాదులు చేయడం కోసమో వచ్చిన వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లల పట్ల పోలీసులు స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు. అలాగే రౌడీషీటర్స్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులు, సమాజానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారి పట్ల లాఠీ పోలీసింగ్ ఉంటుందని హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది కొరత వాస్తవమేనని, కొద్ది రోజుల్లో కొత్త సిబ్బంది వచ్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ భవ్యారెడ్డి, సీఐ కె.నారాయణరావు, ఎస్సై వి.ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాసమస్యలపై స్పందించాలి
బాడంగి: పోలీస్‌స్టేషన్‌లో తమసమస్యల గురించి చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలను మర్యాదపూర్వకంగా కూర్చోబెట్టి సమస్యగురించి సావధానంగా విని పరిష్కారానికి కృషిచేయాలని సిబ్బందిని ఆదేశించినట్టు ఎస్పీ ఏఆర్.దామోదర్ చెప్పారు. ఈ మేరకు బాడంగి పోలీస్‌స్ట్షేన్‌ను ఆయన ఆదివారం సందర్శించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సమస్యలలో లీగల్ పొజిషన్ ఉంటే వారికి స్పష్టంగా చెప్పాలన్నారు. రౌడీషీటర్లు, చైన్‌స్నాచర్స్, దొంగతనాలు జరగకుండా మరింతగా చర్యలు చేపట్టాలని సూచించినట్లు తెలిపారు.
ఎస్పీ ఏఆర్ దామోదర్


