కొనసాగిన ఖోఖో పోటీలు
విజయనగరం: జిల్లా వేదికగా రెండవ రోజు రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు ఆదివారం కొనసాగాయి. నగర శివారులో గల విజ్జి స్టేడియంలో జరుగుతున్న పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు తలపడ్డారు. సోమవారం ఫైనల్స్ నిర్వహించిన అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. అంతేకాకుండా జాతీయస్థాయి స్కూల్‌గేమ్స్ పోటీలకు రాష్ట్ర జట్టును ఎంపిక చేయనున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర స్థాయి పోటీలకు వివిధ జిల్లాల నుంచి పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులకు కల్పించిన సౌకర్యాలపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక కస్పా ఉన్నత పాఠశాలలో వసతి కల్పించిన క్రీడాకారులకు స్నానాలు చేసేందుకు అనువైన సదుపాయాలు లేకపోవడంతో పాఠశాల ఆవరణలో ఆరుబయట స్నానాలు చేశారు. దీంతో పాఠశాల ప్రాంగణం బురదమయంగా మారడంతో రోజువారీ శిక్షణకు వచ్చే క్రీడాకారులు ఇబ్బందులు పడ్డారు.


