ఫెన్సింగ్ పోటీలకు జిల్లా జట్టు సిద్ధం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో రాజమండ్రిలో జరగనున్న సీనియర్స్ సీ్త్ర, పురుషుల ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక ఆదివారం పూర్తయింది. నగర శివారులో గల విజ్జి స్టేడియంలో నిర్వహించిన ఎంపికల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి 50 మంది క్రీడాకారులు హాజరుకాగా పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 25 మంది క్రీడాకారులను అభినందించారు. ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడంతో పాటు జాతీయ స్థాయిపోటీలకు అర్హత సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ చీఫ్ కోచ్ డీవీ చారిప్రసాద్, పలువురు శిక్షకులు పాల్గొన్నారు.
రాష్ట్ర సాఫ్ట్‌బాల్ పోటీల్లో జిల్లాకు ద్వితీయ స్థానం
సత్తెనపల్లి: 12వ రాష్ట్ర సీనియర్ అంతర్ జిల్లాల సాఫ్ట్‌బాల్ చాంపియన్ షిప్ 2025 విజేతగా గుంటూరు నిలిచింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లయోలా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌లో నిర్వహించిన 12వ రాష్ట్ర సీనియర్ అంతర్ జిల్లాల సాఫ్ట్‌బాల్ చాంపియన్ షిప్ 2025 పోటీలు హోరాహోరీగా జరిగాయి. పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన గుంటూరు టీమ్ చాంపియన్‌షిప్ కై వసం చేసుకుంది. ద్వితీయ స్థానాన్ని విజయనగరం టీమ్, తృతీయ స్థానం అనంతపురం టీమ్ కై వసం చేసుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.జగ్గారావు హాజరై మాట్లాడారు. క్రీడలతోపాటు విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో 415 పోస్టుల్లో 49 పోస్టులు సాఫ్ట్‌బాల్ క్రీడాకారులకు దక్కడం అభినందనీయమన్నారు.
ట్రాక్టర్ బీభత్సం..
తప్పిన ప్రమాదం
రాజాం సిటీ: మండల పరిధి ఒమ్మి గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై వై.రవికిరణ్ తెలిపిన వివరాల మేరకు తెర్లాం మండలం నందిగాం గ్రామానికి చెందిన చెరుకూరి గణేష్ ద్విచక్రవాహనం నిలుపుదల చేసి ఒమ్మి గ్రామ సమీపంలో రోడ్డు పక్కన కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. అదే సమయంలో రాజాం నుంచి రామభద్రపురం వైపు వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి మోటార్‌సైకిల్‌తో పాటు గణేష్‌ను, రోడ్డు పక్కన ఉన్న బోనంగి శ్రీహరినాయుడిని ఢీకొని పక్కనున్న బట్టీలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో గణేష్, శ్రీహరినాయుడు, కూరగాయలు విక్రయిస్తున్న పల్లా నర్సమ్మకు గాయాలయ్యాయి. ఇది గమనించిన మరికొంతమంది స్థానికులు పరుగులు తీశారు. వెంటనే స్థానికులు అప్రమత్తమైన బాధితులను 108 సహాయంతో రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
బస్సు, లారీ డీ: ఇద్దరికి స్వల్పగాయాలు
దత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి, మరడాం మధ్యలో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి బస్సు, లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..రామభద్రపురం నుంచి రెండు వాహనాలు గజపతినగరం వెళ్తుండగా కోమటిపల్లి మరడాం మధ్యలో వెనుక నుంచి లారీని బస్సు ఢీకొనడంతో బస్సులో ఉన్న ఇద్దరికి గాయాలు కాగా తోటి ప్రయాణికులు వారిని మరో బస్సు ఎక్కించి పంపించారు. ఈ విషయమై ఎస్ బూర్జవలస ఎస్సై వద్ద ప్రస్తావించగా తమకు ఫిర్యాదు అందలేదని చెప్పారు.
ఫెన్సింగ్ పోటీలకు జిల్లా జట్టు సిద్ధం
ఫెన్సింగ్ పోటీలకు జిల్లా జట్టు సిద్ధం


