తెలుగు రాష్ట్రాల ఆహ్వాననాటిక పోటీల విజేతలు వీరే
విజయనగరం టౌన్: గురజాడ కళాభారతిలో మూడురోజుల పాటు నిర్వహించిన నాటికపోటీల విజేతల వివరాలను సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు అభినయ శ్రీనివాస్, గెద్ద వరప్రసాద్‌లు ఆదివారం వెల్లడించారు. జ్యూరీ బహుమతులు మంజునాథ(గేమ్), కుమారి హర్షిణి (అమ్మ చెక్కిన బొమ్మ), మణికంఠ (కిడ్నాప్), ఉత్తమ లైటింగ్ శ్రీకాంత్, ఉత్తమ ఆహార్యం నాగు, ఉత్తమ సంగీతం నాగరాజు, ఉత్తమ రంగాలంకరణ ఎం.సత్తిబాబు, ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ పి.బాలాజీ నాయక్ (అసత్యం), ఉత్తమ సహాయనటుడు పి.రామారావు (అసత్యం), ఉత్తమ ప్రతినాయకుడు వై.అనిల్ కుమార్ (అసత్యం), ఉత్తమ ద్వితీయ నటి ఎస్.జ్యోతి (స్వప్నం రాల్చిన అమృతం), ఉత్తమ నటి జ్యోతిరాజ్ భీశెట్టి, ఉత్తమ నటుడు భానుప్రకాష్, ఉత్తమ దర్శకత్వం డాక్టర్ వెంకట్ గోవాడ, ఉత్తమ రచన, ఉత్తమ ప్రదర్శన (అమ్మ చెక్కిన బొమ్మ), ఉత్తమ ద్వితీయప్రదర్శన (స్వప్నం రాల్చిన అమృతం)లకు బహుమతులు లభించాయి. పరిషత్ న్యాయనిర్ణేతలుగా పిటి.మాధవ్ (విశాఖ), మానాపురం సత్యనారాయణ (పాలకొల్లు), చిన్నారావు (శ్రీకాకుళం)లు వ్యవహరించారు.
అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ లభ్యం
గరుగుబిల్లి: గత నెల 27న మండలంలోని సంతోషపురం గ్రామానికి చెందిన నల్ల గంగునాయుడు తన కుటుంబసభ్యులతో కలిసి తిరుపతి దైవదర్శనం నిమిత్తం వెళ్లగా 28న తిరుమలలోని విష్ణు నివాసం వద్ద తప్పిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యా దు చేయగా సుంకి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తిరుమలలో పోలీస్‌శాఖలో పనిచేస్తున్న క్రమంలో వారి కి ఆచూకీ లభ్యం కావడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి తప్పిపోయిన గంగునాయుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కానిస్టేబుల్స్ రఘు, తిరుమల శేషులను గ్రామస్తులు అభినందించారు.


