
ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా దేవీమాధవి
విజయనగరం ఫోర్ట్: విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్ దేవీమాధవి నియమితులయ్యారు. ఆమె వైద్య కళాశాలలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన డాక్టర్ కె.పద్మలీల గురువారం ఉద్యోగ విరమణ పొందారు.
2న రైతుల ఖాతాలకు
పెట్టుబడి సాయం
విజయనగరం ఫోర్ట్: అన్నదాత సుఖీభవ పథ కం లబ్ధి ఈ నెల 2న రైతుల బ్యాంకు ఖాతా లకు జమకానుందని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. పథకం కింద జిల్లాలో 2,19,503 మందికి లబ్ధిచేకూరనుందన్నారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో వ్యవసాయ శాఖ అధికారులతో గురువారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నదాత సుభీభవలో రాష్ట్ర వాటా కింద రైతులకు రూ.5 వేలు చొప్పున రూ.109.75 కోట్లు, కేంద్రం వాటా పీఎం కిసాన్ కింద రూ.2వేలు చొప్పన 1.93 లక్షల మందికి రూ. 38.60 కోట్ల పెట్టుబడి సాయం అందనుందన్నారు. సమావేశంలో కేఆర్‌ఆర్‌సీ ప్రత్యేక కలెక్టర్ మురిళి, జిల్లా వ్యవసాయ అధికారి తారకరామారావు, లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ మేనేజర్ రమణమూర్తి, డ్వామా పీడీ శారద, జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, సీపీఓ బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.
వైద్యసేవల వివరాలు
పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి
● డీఎంహెచ్‌ఓ జీవనరాణి
విజయనగరం ఫోర్ట్: పీహెచ్‌సీల్లో అందించే వివరాలు పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి తెలిపారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు గురువారం సర్వేలెన్స్ వర్క్‌షాపు నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికంగా ఎక్కడైనా వ్యాధులు వ్యాప్తిచెందితే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఈఓ డాక్టర్ అచ్యుతకుమారి, ఎన్‌సీడీ పీఓ డాక్టర్ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర సర్వేలెన్స్ ఆఫీసర్ జాన్, తదితరులు పాల్గొన్నారు.
జ్వరాల పంజా
బొబ్బిలి: పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహం విద్యార్థినులుపై జ్వరాలు పంజా విసురుతున్నాయి. ఇప్పటికే పలువురు జ్వరాలతో బాధపడుతూ కోలుకోగా.. కొమరాడకు చెందిన కొండగొర్రి సౌజన్యను వైద్యపరీక్ష కోసం వార్డెన్ రాణి బొబ్బిలి సీహెచ్‌సీకి గురువారం తీసుకెళ్లారు. ఆమెకు వైద్య పరీక్షలు చేయగా మలేరియా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బాలికను ఇన్‌పేషేంట్‌గా చేర్చుకుని వైద్యసేవ లు అందిస్తున్నారు. బొబ్బిలిలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల భవనాన్ని ఎస్సీ కళాశాల బాలికల వసతి గృహానికి కేటాయించారు. కొన్ని గదులను ఆశ్రమ పాఠశాల స్టోర్ రూం, సిక్ రూంలకు వినియోగిస్తున్నారు. మిగిలిన గదులను విద్యార్థినులకు వినియోగిస్తున్నారు. భవనం ఇరుకుగా మారిందని విద్యార్థినులు వాపోతున్నారు. వార్డెన్ కార్యాలయంలోనే వంట గదిని కూడా నిర్వహిస్తున్నారు. తాగునీటికి పాఠశాల బోరును వసతి గృహ నిర్వాహకులే వినియోగిస్తున్నారు. పట్టణానికి దూరంగా వసతి గృహం ఉండడంతో పట్టణంలోని కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. పట్టణంలోకి వసతిగృహాన్ని మార్చాలని కోరుతున్నారు.

ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా దేవీమాధవి

ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా దేవీమాధవి

ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా దేవీమాధవి